వ్యాక్సిన్లు ఇవ్వలేనందుకు మేం ఉరేసుకోవాలా?

వ్యాక్సిన్లు ఇవ్వలేనందుకు మేం ఉరేసుకోవాలా?

న్యూఢిల్లీ: టీకా ఉత్పత్తిలో ఫెయిల్ అయినందుకు తాము ఉరేసుకోవాలానని కేంద్ర కెమికల్స్, ఫర్టిలైజర్స్ మంత్రి డీవీ సదానంద గౌడ అన్నారు. 'దేశంలోని అందరికీ టీకాలు ఇవ్వాలని కోర్టులు చెప్పడం మంచిదే. కానీ సరిపడా వ్యాక్సిన్ నిల్వలు లేనప్పుడు, టీకా ఉత్పత్తి కానప్పుడు మేం మాత్రం ఎలా ఇవ్వగలం? మమ్మల్ని ఉరేసుకోమంటారా?' అని సదానంద ప్రశ్నించారు. వ్యాక్సిన్ షార్టేజీని అధిగమించేందుకు కేంద్రం సిన్సియర్ గా యత్నిస్తోందని తెలిపారు. అయితే ఇలాంటి విషయాలను నియంత్రించడం చాలా కష్టమన్నారు.