ఆస్పత్రిలో సేవలను స్వయంగా చూసి కలెక్టర్ ఏం చేశారంటే..

ఆస్పత్రిలో సేవలను స్వయంగా చూసి కలెక్టర్ ఏం చేశారంటే..
  • విధులకు డుమ్మాకొట్టిన 8 మంది డాక్టర్లు సహా 17మంది హెల్త్ స్టాఫ్ కు షోకాజ్ నోటీసులు జారీ
  • మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిలో వైద్య సేవల తీరు మారకపోతే చర్యలు తప్పవన్న కలెక్టర్

మహబూబాబాద్ జిల్లా: ఏరియా ఆస్పత్రిలో విధులకు గైర్హాజరైన  17 మంది వైద్య సిబ్బందికి షోకాజ్ నోటీసులు అయ్యాయి. క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన జిల్లా కలెక్టర్ శశాంక ఏరియా ఆస్పత్రిని సందర్శించి తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వైద్య సేవలపై రోగులతో మాట్లాడి ఆరా తీశారు. వైద్య సిబ్బందితో మాట్లాడారు. ఓపీలో డ్యూటీ డాక్టరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరుపట్టీని పరిశీలించగా 8 మంది డాక్టర్లు, 8 మంది స్టాఫ్ నర్సులు, ఒక ఏ.ఎన్.ఎం విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు. వైద్య సిబ్బంది పనితీరు, సేవలపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించి వెళ్లారు. దవాఖానలో అధ్వాన్న సేవలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ దృష్టికి తీసుకెళ్లి చర్యలకు సిఫారసు చేశారు. జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశాలతో ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.వెంకట్రాములు 8 మంది డ్యూటీ డాక్టర్లు మరో 8 మంది స్టాఫ్ నర్సులు, ఒక ఏఎన్ ఎంలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 

 

ఇవి కూడా చదవండి

డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టడం లేదు.. కట్టిన చోట ఇవ్వట్లే

ఒక్క కశ్మీరీ పండిట్ కుటుంబాన్నైనా స్వస్థలానికి పంపారా?

గురుగావ్ లో మల్టీఫ్లెక్స్ కడుతోన్న ఐఏఎస్ ఎవరు?