డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టడం లేదు.. కట్టిన చోట ఇవ్వట్లే

డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టడం లేదు.. కట్టిన చోట ఇవ్వట్లే
  • ఎన్నికల ముందు పంచి ఓట్లు దండుకోవడం కోసమే కాలయాపన
  • మాజీ ఐపీఎస్, బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్  ప్రవీణ్ కుమార్

నల్గొండ: సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట నుంచి బేగం పేట వరకు రోడ్డు కబ్జా చేశారని మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్  ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ చేసిన కబ్జా గురించి ఎవరు అడగటం లేదని వెల్లడించారు. మరో వైపు పేదలకు డబల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానని మాటలు చెబుతూనే ఉన్నాడని.. చాలా చోట్ల డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టడం లేదు, కట్టిన చోట ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ముందు పంచి ఓట్లు దండుకోవడం కోసమే కాలయాపన చేస్తున్నారని ఆయన విమర్శించారు. బీఎస్పీ  రాష్ట్ర కోఆర్డినేటర్  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  బహుజన రాజ్యాధికార యాత్ర శనివారం  21వ రోజుకి   చేరుకుంది. ఇవాళ శనివారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో వెలిమినేడు, గుండ్రంపల్లి, ఏపూర్, సుకెనపల్లి, పెద్దకాపర్తి, చిట్యాల మున్సిపాలిటీలో బహుజన యాత్ర నిర్వహించారు. చిట్యాలలో అంబెడ్కర్, పూలే, బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 
ఈ సందర్భంగా ఆర్.ఎస్  ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ బహుజన రాజ్యాధికార యాత్ర కి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. రాష్టంలో ఎక్కడకు వెళ్లినా పేద ప్రజలు పుట్టెడు దుఃఖంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సాగునీరు ఉన్నా ఇవ్వడం లేదన్నారు. 2005లో మొదలైన ధర్మారెడ్డిపల్లి, పిలయపల్లి కాల్వలకు ఇప్పటికి నిధులు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఈ ప్రాంతం ప్రాజెక్ట్ కి నిధులు కేటాయించడం లేదని, ఒక వేళా  కేటాయించిన అది కాగితాల మీదనే ఉంటుంది.. ఆ బడ్జెట్ మొత్తం ఆయన పాంహౌస్ కాల్వల పనులకు వెళ్తుందని ఆరోపించారు. 
మూసీ నీళ్ల వల్లే కిడ్నీ సమస్యలు
మూసి నీళ్లనే వాడటం వల్ల చాలా మంది ప్రజలు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు సరైన వైద్య సదుపాయాలు కూడా లేవని, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో మౌళిక సదుపాయాలు కల్పించి డాక్టర్ల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.ఆస్పత్రుల్లో సర్వైకల్ క్యాన్సర్ కి సంభందించిన టీకా ఇవ్వడం లేదని, గ్రామీణ ప్రాంతాలలో అమ్మాయిలకు  కాన్సర్ పై అవగాహన ఉండడం లేదన్నారు. వెంటనే ఎచ్ పి వి వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిట్యాలలో ఎస్సి, బిసి, మైనార్టీ రెసిడెన్సిల్ స్కూల్ ఏర్పాటు చేయాలన్నారు. వెలిమినేడు గ్రామంలో ఫార్మా కంపెనీల పేరుతో పేదల నుంచి ప్రభుత్వం 600ఎకరాలు గుంజుకుంటోందని.. దీన్ని ఎట్టి పరిస్థితిలో అడ్డుకుంటామని ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. 
లక్షల మందికి ఫించన్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం
రాష్టంలో లక్షల మందికి వృద్దులకు, వితంతువులకు ఫించన్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్  ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. చిట్యాలలో రోడ్లపై తోపుడు బండ్ల వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పూసల కులం వారిని ఎంబీసీలో కలపాలని.. వారికి తగిన కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆలయాల్లో అర్చకులకు ప్రభుత్వం ఇచ్చే రూ.4 వేల జీతం ఏమూలకూ సరిపోవడం లేదని, అర్చకులకు వెంటనే జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. 

 

 

ఇవి కూడా చదవండి

ఒక్క కశ్మీరీ పండిట్ కుటుంబాన్నైనా స్వస్థలానికి పంపారా?

గురుగావ్ లో మల్టీఫ్లెక్స్ కడుతోన్న ఐఏఎస్ ఎవరు?

RRR ఓ మాస్టర్ పీస్

నాలుగు రోజుల్లో మూడోసారి.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు