RRR ఓ మాస్టర్ పీస్.. ఆ మూవీ ఒక అగ్నిపర్వతం

RRR ఓ మాస్టర్ పీస్.. ఆ మూవీ ఒక అగ్నిపర్వతం

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్​ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా పది వేలకు పైచిలుకు స్క్రీన్లలో రిలీజైన ఈ మూవీ.. తొలిరోజు ఏకంగా రూ.248 కోట్లకు పైగా గ్రాస్ సాధించి.. బాహుబలి 2 రికార్డును అధిగమించింది. ఇకపోతే, దర్శకధీరుడు తెరకెక్కించిన ఈ భారీ మల్టీస్టారర్ సినిమాకు సాధారణ ప్రేక్షకులతోపాటు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా మంచి అప్లాజ్ వస్తోంది. ఆర్ఆర్ఆర్ ఓ మాస్టర్ పీస్ అని మెగాస్టార్ చిరంజీవి మెచ్చుకున్నారు. రాజమౌళి సినిమాటిక్ విజన్ కు నిలువుటద్దంలా ఈ చిత్రం నిలిచిందన్నారు. మొత్తం టీమ్ కు హ్యాట్సాఫ్ అని ట్వీట్ చేశారు.

చిరుతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ గురించి ట్వీట్లు చేశారు. కాలానికి సంబంధం లేకుండా ఎల్లప్పటికీ ప్రతిధ్వనించే ధ్వని లాంటి సినిమా ఇది అని టాప్ డైరెక్టర్లలో ఒకడైన శంకర్ ట్వీట్ చేశారు. తారక్, చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిందన్నారు. ముఖ్యంగా భీమ్ గా ఎన్టీఆర్ తన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడని అభినందించారు. జక్కన్న ఊహ, సృజనాత్మకత అందుకోలేనిదని.. ఆయన రాజమౌళి కాదు.. ‘మహారాజ’మౌళి అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. 

‘ఆర్ఆర్ఆర్’ మూవీ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉందని.. రాజమౌళి తను అన్ని క్రాఫ్ట్స్ లో మాస్టర్ అని మరోమారు నిరూపించుకున్నారని ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని అన్నారు. తారక్, చరణ్​ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పారు. 

ఆర్ఆర్ఆర్ మైండ్ బ్లోయింగ్ గా ఉందని.. దేశం గర్వించే దర్శకుడైన రాజమౌళికి కంగ్రాట్స్ అంటూ డైరెక్టర్ హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్​ తేజ్ కు హ్యాట్సాఫ్ అన్నారు. రామభీములు తొక్కుకుంటూ పోయారని మరో దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. 

రాజమౌళి దర్శకత్వ పనితీరును చూసి ఎంతో నేర్చుకున్నానని.. ఆయనకు తాను ఏకలవ్య శిష్యుడ్ని అని యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. ప్రతిసారి అద్భుతాలు చేస్తూ జక్కన్న తనను సర్ ప్రైజ్ చేస్తున్నారని అన్నారు. ఆర్ఆర్ఆర్ ఓ ఎమోషనల్ రైడ్ లాంటి మూవీ అని.. థియేటర్ లో ‘కొమురం భీముడో’ పాట చూసి ఏడ్చేశానన్నారు. 

‘ఆర్ఆర్ఆర్ ఓ ఆలిండియన్ అగ్నిపర్వతం’ అని హీరో అడివి శేష్ ట్వీట్ చేశాడు. ఉన్నతంగా ఆలోచించాలని ఈ జనరేషన్ కు నేర్పించిన రాజమౌళికి మరో హీరో సందీప్ కిషన్ కృతజ్ఞతలు తెలిపాడు. చరణ్, తారక్ ల ఎఫర్ట్స్ స్ఫూర్తి నింపాయన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

రికార్డు స్థాయి కలెక్షన్స్తో దూసుకెళ్తున్న RRR

కశ్మీర్ ఫైల్స్ వసూళ్లపై ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్

నాలుగు రోజుల్లో మూడోసారి.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు