కశ్మీర్ ఫైల్స్ వసూళ్లపై ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్

కశ్మీర్ ఫైల్స్ వసూళ్లపై ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ కలెక్షన్లపై ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ పడింది. రాజకీయంగా పలు చర్చలు, వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన కశ్మీర్ ఫైల్స్ సినిమా వసూళ్లు శుక్రవారం గణనీయంగా తగ్గాయి. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం భారీస్థాయిలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. హిందీ బెల్ట్ లో కూడా ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడం, అదే సమయంలో ఎక్కువ స్క్రీన్లు ఈ సినిమాకే కేటాయించడం, షోలు తగ్గించడం కూడా కశ్మీర్ ఫైల్స్ పై ప్రభావం పడింది. 90వ దశకం ఆరంభంలో కశ్మీర్ లో పండిట్ల నరమేధం, వలసలు, వారిపై మిలిటెంట్ల దాడుల నేపథ్యంగా తెరకెక్కిన ‘కశ్మీర్ ఫైల్స్’ శుక్రవారం రూ.4.50 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. మొత్తానికి రెండొందల కోట్ల క్లబ్ లో చేరిన ఈ మూవీ.. ఇప్పటికి రూ.211.83 కోట్ల కలెక్షన్స్ సాధించింది. 

మరిన్ని వార్తల కోసం:

నాలుగు రోజుల్లో మూడోసారి.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

రాజీవ్ గృహాలను పరిశీలించిన సీఎస్ సోమేశ్

ఉగాది తర్వాత వడ్ల ఉద్యమం