రికార్డు స్థాయి కలెక్షన్స్తో దూసుకెళ్తున్న RRR

రికార్డు స్థాయి కలెక్షన్స్తో దూసుకెళ్తున్న RRR

హైదరాబాద్: భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ‘ఆర్ఆర్ఆర్’ శుక్రవారం రిలీజై పాజిటివ్ టాక్ తో రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీకి ఓపెనింగ్ డే రికార్డు స్థాయి కలెక్షన్స్ వచ్చాయి. తొలిరోజు ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా రూ.248 కోట్ల గ్రాస్ సాధించింది. ఫస్ట్ డే కలెక్షన్స్ లో ఇది ఆల్ టైమ్ రికార్డుగా చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.127.2 కోట్లు కొల్లగొట్టింది. ఓవర్సీస్ లోనూ రూ.69.1 కోట్ల వసూళ్లు సాధించింది. అమెరికాలో ప్రీమియర్స్ కలుపుకుని తొలిరోజు 5 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. దీంతో బాహుబలి–2 (4.59 మిలియన్లు) పేరిట ఉన్న గత రికార్డును అధిగమించింది. తెలుగు సినిమాలకు మరో కీలక మార్కెట్ గా భావించే కర్నాటకలో రూ.16.04 కోట్లు సాధించింది. ఇక హిందీ బెల్ట్ లో రూ.22.6 కోట్లు, తమిళనాడులో రూ.9.20 కోట్లు, కేరళలో రూ.4.01 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. 

మరిన్ని వార్తల కోసం:

కశ్మీర్ ఫైల్స్ వసూళ్లపై ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్

నాలుగు రోజుల్లో మూడోసారి.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

రాజీవ్ గృహాలను పరిశీలించిన సీఎస్ సోమేశ్