V6 News

డగౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫోన్ వాడిన రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు షోకాజ్

డగౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫోన్ వాడిన రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు షోకాజ్

ఢిల్లీ: రాజస్తాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ చుట్టూ మొబైల్ ఫోన్ వివాదం ముదురుతోంది.  గువాహతిలో ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా డగౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫోన్ వాడినందుకు రోమీకి  బీసీసీఐ యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ (ఏసీయూ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఐపీఎల్ పీఎంఓఏ (ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా) ప్రొటోకాల్ ప్రకారం టీమ్ మేనేజర్లు డ్రెస్సింగ్ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొబైల్ వాడుకునే చాన్స్ ఉన్నా.. డగౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫోన్ ఉపయోగించడంపై కఠిన నిషేధం ఉంది.

ఆ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భిందర్ తన స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్ చూస్తుండగా, పక్కనే యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టర్ వైభవ్ సూర్యవంశీ ఉండటం నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుందని ఏసీయూ భావిస్తోంది. భిందర్ గతంలో ఆరోగ్య సమస్యలతో వెంటిలేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఉన్నాడని, బహుశా వైద్య కారణాల రీత్యా ఫోన్ వాడి ఉండవచ్చనే కోణంలోనూ విచారణ జరుగుతోంది. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రేక్ చేసినట్టు తేలితే మ్యాచ్ నిషేధం లేదా భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. కాగా, ఈ ఘటనపై విచారణ జరుగుతున్నప్పటికీ, సోమవారం ఉప్పల్ స్టేడియంలో సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రైజర్స్, రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్ టాస్ సమయంలో భిందర్ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే కనిపించాడు.