- టెస్ట్ చేయకుండా రక్తసేకరణ, నిల్వల్లో లోపాలు
- రెండు రోజుల పాటు సోదాలు చేసి డీసీఏ చర్యలు
బషీర్‌బాగ్,వెలుగు: రూల్స్ కు విరుద్ధంగా బ్లడ్ బ్యాం క్స్ నిర్వహించే 9 ప్రైవేటు బ్లడ్ బ్యాంక్స్‌పై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. ఇందులో భాగంగా సిటీలోని పలు ప్రాం తాల్లో గురువారం కూడా సోదాలు చేశారు. వైద్య ప్రమాణాలు పాటించకుండా రక్త నిల్వలు, అధిక ధరలకు బ్లడ్‌ను విక్రయిస్తున్నారని గుర్తించారు.
బ్లడ్ డోనర్స్‌కు ఎలాంటి టెస్ట్ లు చేయకుండానే బ్లడ్ తీసుకుంటున్నట్టు ఆధారాలు సేకరించారు. ప్లేట్‌లెట్స్, ప్లాస్మా నిల్వలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తేల్చారు. మలక్‌పేటలోని శ్రీ బాలాజీ బ్లడ్ సెంటర్, చైతన్యపురిలోని నవజీవన్ బ్లడ్ సెంటర్, లక్డీకాపుల్‌లోని ఏవీఎస్ బ్లడ్‌సెంటర్, హిమాయత్‌నగర్‌లోని రుధిర వలంటరీ బ్లడ్ సెంటర్,సికింద్రాబాద్‌లోని ప్రతిమ సాయి బ్లడ్ సెంటర్, కోఠిలోని రక్షిత వలంటరీ బ్లడ్ బ్యాంక్, మెహీదీపట్నంలోని వివేకానంద బ్లడ్‌సెంటర్, బాలానగర్‌లోని నంది బ్లడ్‌సెంటర్, ఉప్పల్ ఎంఎస్ఎన్ బ్లడ్ సెంటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
