గజ్వేల్లో కాంగ్రెస్ బలాన్ని చూపించండి.. సర్పంచ్ అభ్యర్థులకు మంత్రి వివేక్ దిశానిర్దేశం

గజ్వేల్లో కాంగ్రెస్ బలాన్ని చూపించండి.. సర్పంచ్ అభ్యర్థులకు మంత్రి వివేక్ దిశానిర్దేశం

గజ్వేల్లో కాంగ్రెస్ బలాన్ని చూపించాలని సర్పంచ్ అభ్యర్థులకు మంత్రి వివేక్ వెంకటస్వామి దిశానిర్దేశం చేశారు. మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం (డిసెంబర్ 17) గజ్వేల్ లో సర్పంచ్ అభ్యర్థులతో చర్చించారు. పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

రాష్టంలో కాంగ్రెస్ పార్టీ బలంగ ఉందని అన్నారు మంత్రి వివేక్. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ బీఆర్ఎస్ తో కాదని.. మన పార్టీ వాళ్ళతో నే మనకు పోటీ ఉందని అన్నారు. గ్రామాల్లో బీఆర్ఎస్ క్యాడర్ కోల్పోయిందని అన్నారు. 

పదేండ్లలో కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ అని  ప్రజలను మభ్యబెట్టి కొన్ని మాత్రమే కట్టారని విమర్శించారు. సిద్దిపేట జిల్లాలో 3 వేలు కాకుండా మరో 500 ఇందిరమ్మ ఇండ్లు ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కాంగ్రస్ పార్టీదేనని అన్నారు. కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన పథకాలు ప్రజల్లోకి వెళ్లాయని.. గజ్వెల్ లో సర్పంచ్ లను గెలుపుంచుకుని కాంగ్రెస్ బలమేంటో నిరూపించాలని సూచించారు.