వెంకయ్యనాయుడు ప్రశంసలు..రాష్ట్ర సర్కార్ నోటీసు

వెంకయ్యనాయుడు ప్రశంసలు..రాష్ట్ర సర్కార్ నోటీసు
  • ట్రాక్టర్ నడుపుతూ కరోనా పేషెంట్ డెడ్ బాడీని శ్మశానానికి చేర్చిన డాక్టర్ శ్రీరామ్  కు షోకాజ్
  • డ్రైవర్ రావడం లేటవుతుందనే తీసుకెళ్లినట్లు ఆయనతో వివరణ
  • దేశమంతా డాక్టర్ సేవకు ప్రశంసలు.. ఇక్కడేమో చీవాట్లు
  • ఆయన చొరవ స్ఫూర్తిదాయకమన్న ఉపరాష్ట్ర పతి

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్​లో కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి  డెడ్​బాడీని  ట్రాక్టర్​లో వేసుకొని స్వయంగా నడుపుకుంటూ శ్మశానవాటికకు తీసుకెళ్లిన డాక్టర్ శ్రీరామ్​పై రాష్ట్ర సర్కార్​కు కోపమొచ్చింది. డెడ్​బాడీ తరలింపులో ఐసీఎంఆర్​ గైడ్​లెన్స్​ పాటించలేదని ఆరోపిస్తూ..  డాక్టర్​ అయి ఉండి మృతదేహాన్ని ఎందుకు తరలించాల్సి వచ్చిందో చెప్పాలంటూ ఆయనకు జిల్లా ఆఫీసర్లు షోకాజ్​ నోటీస్​ జారీ చేశారు. దీనికి డాక్టర్​ శ్రీరామ్​ రాతపూర్వకంగా సంజాయిషీ లెటర్ ఇవ్వాల్సి వచ్చింది. డ్రైవర్​ రావడం లేటవుతుందనే తీసుకెళ్లాను తప్ప మరో ఉద్దేశం లేదంటూ ఆయనతో వివరణ తీసుకున్నారు. అన్ని శాఖల నడుమ కో ఆర్డినేషన్​ ఉందంటూ డాక్టర్​ పేరుతో ఏకంగా ప్రెస్​నోట్​ కూడా రిలీజ్  చేయించారు. డెడ్​బాడీని ట్రాక్టర్​లో వేసుకొని స్వయంగా నడుపుకుంటూ శ్మశానానికి చేర్చిన డాక్టర్​ శ్రీరామ్  సేవను దేశమంతా మెచ్చుకుంటుండగా.. సర్కారు మాత్రం షోకాజ్​ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది.

శభాష్‌ అంటూ మెచ్చుకున్న వైస్‌ ప్రెసిడెంట్‌

న్యూఢిల్లీ,వెలుగు: కరోనా పేషెంట్​ డెడ్​బాడీని ట్రాక్టర్​లో వేసుకొని తానే డ్రైవ్​ చేసుకుంటూ శ్మశానవాటికకు తీసుకెళ్లిన డాక్టర్​ శ్రీరామ్​ను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. ‘‘కరోనా మృతుడి భౌతికకాయం తరలింపునకు మున్సిపాలిటీ డ్రైవర్ నిరాకరించడంతో స్వయంగా తానే ట్రాక్టర్ నడిపి శ్మశానవాటికకు తీసుకెళ్లిన పెద్దపల్లి జిల్లా కరోనా నిఘా అధికారి డాక్టర్ పెండ్యాల శ్రీరామ్​ గారి చొరవను అభినందిస్తున్నాను. వీరి చొరవ, అంకితభావం సమాజానికి స్ఫూర్తిదాయకం కావాలి” అని ఉప రాష్ట్రపతి మంగళవారం ట్వీట్​ చేశారు.

ట్రాక్టర్​ నడిపిన డాక్టర్‌కు..షోకాజ్‌ నోటీసు ఇచ్చిన సర్కారు

మున్సిపల్​ శాఖకు చెడ్డ పేరు వచ్చిందట!

శ్రీరామ్‌ పని వల్ల మంత్రి కేటీఆర్ ​ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపల్​ శాఖకు చెడ్డ పేరొచ్చిందట. అందుకే సీనియర్​ ఆఫీసర్ల ఆదేశాల మేరకు జిల్లా ఆఫీసర్లు సంజాయిషీ లెటర్​ తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. అంతేకాకుండా శ్రీరాం ద్వారా సోమవారం రాత్రి పత్రికా ప్రకటన కూడా విడుదల చేయించారు. పెద్దపల్లి జిల్లా ఆస్పత్రిలో మార్చురీ అంబులెన్స్ అందుబాటులో లేకే ట్రాక్టర్​ వాడామని, డెడ్​బాడీ  తరలింపులో శాఖల మధ్య ఎలాంటి కో ఆర్డినేషన్​ లోపం లేదని ప్రకటనలో డాక్టర్​ శ్రీరామ్​ పేర్కొన్నారు. ‘‘డ్రైవర్ రావడానికి కొంత టైం పడుతుందని, అప్పటివరకు  కరోనా పెషెంట్ డెడ్​బాడీ తరలించకపోతే ఇతరులకు ఇబ్బం ది కలుగుతుందనే ఉద్దేశంతోనే నేనే స్వయంగా ట్రాక్టర్​ డ్రైవ్​ చేసుకుంటూ శ్మశానవాటికకు తీసుకెళ్లాను. కరోనా డెడ్​బాడీల తరలింపులో సమాజంలో ఉన్న కొన్ని అపోహలను కూడా తొలగించాలని కూడా భావించాను.  కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, మున్సిపల్​శాఖ అధికారులు కో ఆర్డినేషన్​తో పని చేస్తున్నారు’’ అని ఆయన వివరించారు.

ప్రభుత్వానికి ఇంత అహంకారమా?