మంత్రి కొడాలి నానికి షోకాజ్ నోటీసులు

మంత్రి కొడాలి నానికి షోకాజ్ నోటీసులు

ఇంటింటికీ రేషన్ సరఫరా పథకాన్ని ఎన్నికల కోడ్ పేరుతో ఎస్ఈసీ నిలిపివేసిందని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ‘ఎప్పుడో మొదలుపెట్టిన ఇంటింటికీ రేషన్ సరఫరా పథకాన్ని ఎన్నికల కోడ్ పేరుతో ఆపడానికి ఎస్ఈసీ ప్రయత్నిస్తోంది. వైసీపీకి పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు వస్తాయనే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇలా చేస్తున్నారు. ఆయనకు టీడీపీ వత్తాసు పలుకుతోంది’ అని ఆయన అన్నారు.

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై ఏపీ ఎస్ఈసీ స్పందించింది. ఎస్ఈసీని కించపరుస్తూ కొడాలి నాని వ్యాఖ్యలు చేశారని ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు వివరణ ఇవ్వాలని కొడాలి నానికి ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగతంగా లేదా ప్రతినిధి ద్వారా వివరణ ఇవ్వాలని ఎస్ఈసీ తెలిపింది. గడువులోపు వివరణ ఇవ్వకపోతే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

For More News..

లోకేష్ సర్పంచ్‌గా గెలిస్తే రాష్ట్రం విడిచి వెళ్లిపోతా..

స్పీకర్ ఫార్మట్‌లో రాజీనామా చేసిన గంటా శ్రీనివాస రావు

ఐపీఎల్ వేలంలో అర్జున్ టెండూల్కర్ కనీస ధర రూ. 20 లక్షలే