ఢిల్లీ మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ను ఈడ్చుకెళ్లిన వీడియో

ఢిల్లీ మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ను ఈడ్చుకెళ్లిన వీడియో

ఢిల్లీ మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ (డీసీడబ్ల్యూ) స్వాతీ మాలీవాల్‌‌‌‌‌‌‌‌ ను  ఓ వ్యక్తి కారుతో పాటు ఈడ్చుకెళ్లిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  వీడియోలో ఏముందంటే..‘ నువ్వు నన్ను  ఎక్కడి వరకు డ్రాప్ చేస్తావ్.. నేను మా ఇంటికెళ్లాలి. మా బంధువులు దారిలో ఉన్నారంటూ స్వాతీ మాలీవాల్‌  డ్రైవర్ ని అడుగుతారు. అక్కడి నుంచి వెళ్లిపోయిన డ్రైవర్ మళ్లీ కాసేపటికే తన కారును  యూ టర్న్ చేసుకుని  స్వాతీ మాలీవాల్ దగ్గర ఆపుతాడు. నన్ను ఎక్కడికి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేశావ్.. నువ్వు రావడం ఇది సెకండ్ టైమ్ అంటూ స్వాతీ మాలీవాల్ డ్రైవర్ విండో దగ్గరకు వెళ్లింది. కాసేపటికే  ఆమె అరుపులు వినిపిస్తున్నాయి’. ఈ వీడియో ఇపుడు వైరల్ అవుతోంది.

 ఢిల్లీలోని ఎయిమ్స్‌‌‌‌‌‌‌‌ వద్ద డీసీడబ్ల్యూ చీఫ్ తన టీమ్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఢిల్లీలోని మహిళల భద్రతను పరిశీలించడానికి గురువారం తెల్లవారుజామున 3.05 గంటలకు ఎయిమ్స్‌‌‌‌‌‌‌‌ వద్దకు వచ్చారు. ఎయిమ్స్‌‌‌‌‌‌‌‌ గేట్‌‌‌‌‌‌‌‌ వద్ద ఆమె నిలబడి ఉండగా, ఆమె టీమ్‌‌‌‌‌‌‌‌ కాస్త దూరంలో ఉంది. ఇంతలో ఓ కారు ఆమె దగ్గరికి వచ్చింది. లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ ఇస్తాను.. లోపలికి రమ్మని అందులో ఓ వ్యక్తి పిలిచాడు. దీనికి ఆమె నిరాకరించింది. అతను అక్కడి నుంచి వెళ్లిపోయి, తర్వాత మళ్లీ ఆమె దగ్గరికి వచ్చి, లోపలికి రావాలని బలవంతపెట్టాడు. అతని పట్టుకుందామని కారు దగ్గరికి వెళ్లిన స్వాతీ మాలీవాల్​.. కారు విండోలోంచి  అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా, వెంటనే అతను గ్లాస్‌‌‌‌‌‌‌‌ పైకి ఎత్తడంతో ఆమె చేయి అందులో ఇరుక్కుపోయింది.

తర్వాత అతను కారును ముందుకు పోనివ్వడంతో 15 మీటర్లు ఆమెను అలాగే ఈడ్చుకెళ్లాడు. తర్వాత ఆమె తన చేతిని విడిపించుకోగా, ఆ కారు డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే ఆమె టీమ్‌‌‌‌‌‌‌‌ అక్కడికి చేరుకొని, సాయం చేశారు. తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ కారు డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. సౌత్‌‌‌‌‌‌‌‌ ఢిల్లీలోని సంగమ్‌‌‌‌‌‌‌‌ విహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన 47 ఏండ్ల హరీశ్‌‌‌‌‌‌‌‌ చంద్రగా అతనిని గుర్తించారు. మద్యం మత్తులో అతను ఈ పని చేశాడని వెల్లడించారు. ఈ ఘటనపై రిపోర్టు ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌.. ఢిల్లీ పోలీసుల కోరింది. ‘‘మహిళా కమిషన్‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌కే ఢిల్లీలో సేఫ్టీ లేకుంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. దేవుడి దయ వల్ల నేను ప్రాణాలతో బయటపడ్డా”అని మాలీవాల్ ట్వీట్ చేశారు. ఇది షాకింగ్‌‌‌‌‌‌‌‌ ఘటన అని ఎన్‌‌‌‌‌‌‌‌సీడబ్ల్యూ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ రేఖా శర్మ ట్విట్టర్​లో పేర్కొన్నారు.