
టాలీవుడ్లో ఒక్క సినిమాతోనే సరిపెట్టుకుంది శ్రద్దాకపూర్(Shraddha Kapoor). ఆషికి 2(Aashiqui 2) తో అన్ని భాషల్లో వచ్చిన క్రేజ్‌తో సౌత్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా. కానీ, సాహో(sahoo) రిజల్ట్ ఉసూరుమనిపించడంతో సైలెంట్ అయ్యింది. ప్రస్తుతం ఓ క్రేజీ హీరోతో శ్రద్ధా జోడీ కట్టనుంది. న్యాచురల్ స్టార్ నాని(Nani)తో ఈ హీరోయిన్ నటించనుంది. అయితే, సినిమాలో కాదట. వీరిద్దరూ కలిసి ఓ యాడ్‌లో నటిస్తున్నారు.
హిందీలో బాలీవుడ్ హీరోతో.. తెలుగులో నానితో దీనిని ప్లాన్ చేశారు. అయితే, రెండింటిలో శ్రద్ధా మాత్రం కామన్‌గా ఉంటుందట. దీంతో నాని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ హీరో తన 30వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందులో సీతారామం(seetharamam) ఫేం మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే నాని ఓ రెండు కమర్షియల్ యాడ్స్‌లో కనిపించాడు.
దసరా(Dasara) సక్సెస్‌తో ఊపుమీదున్న నాని యాడ్స్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే మహేశ్(Mahesh babu), అల్లు అర్జున్(Allu arjun) వంటి హీరోలు ఈ ఫార్ములాతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.