కొండగట్టులో అంజన్న ఆలయంలో ముగిసిన సప్తహ వేడుకలు

కొండగట్టులో అంజన్న ఆలయంలో ముగిసిన సప్తహ వేడుకలు

కొండగట్టు,వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న శ్రావణ సప్తహ వేడుకలు గురువారం ముగిసినట్లు అధికారులు, అర్చకులు తెలిపారు. వేడుకల్లో భాగంగా చివరి రోజు ఆంజనేయస్వామికి అష్టోత్తర కలశ స్నపనం నిర్వహించారు. 

కార్యక్రమంలో ఈఓ శ్రీకాంత్, సూపరిటెండెంట్లు సునీల్, చంద్రశేఖర్, పరిహరనాథ్, అర్చకులు పాల్గొన్నారు.