భారత జట్టు కెప్టెన్గా అయ్యర్ సెలక్ట్.. ఊర మాస్ డ్యాన్స్ చేసిన శ్రేయర్ తండ్రి

భారత జట్టు కెప్టెన్గా అయ్యర్ సెలక్ట్.. ఊర మాస్ డ్యాన్స్ చేసిన శ్రేయర్ తండ్రి

Shreyas Iyer’s father’s dance video:  టీమిండియా టీ20 జట్టు (India T20I Team) లీడర్‌షిప్‌లో బీసీసీఐ (BCCI) ఒక మైండ్ బ్లాక్ షాక్ ఇచ్చింది. రీసెంట్‌గా టీ20 వరల్డ్ కప్ గెలిపించిన సూర్యకుమార్ యాదవ్‌పై వేటు వేయడంతో పాటు అతడిని కెప్టెన్సీ నుంచే కాకుండా ఏకంగా స్క్వాడ్ నుంచే డ్రాప్ చేశారు. ఆ ప్లేస్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్, వన్డే జట్టు వైస్ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ను సరికొత్త టీ20 కెప్టెన్‌గా అనౌన్స్ చేశారు. దాదాపు 3 ఏళ్ల తర్వాత టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇస్తూనే అయ్యర్ ఏకంగా కెప్టెన్ కావడం విశేషం.

కెప్టెన్ గా కొడుకు.. తండ్రి ఊర మాస్ డాన్స్: 
శ్రేయస్ అయ్యర్ ఇండియా టీ20 కెప్టెన్ అయ్యాడనే న్యూస్ బయటికి రాగానే.. అటు ముంబైలోని అయ్యర్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. శ్రేయస్ అయ్యర్ తండ్రి సంతోష్ అయ్యర్ తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఫుల్ ఖుషీగా డాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ లైట్ హార్టెడ్ డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

శ్రేయస్ అయ్యర్ సంచలన కామెంట్స్: 
భారత టీ20 కెప్టెన్‌గా సెలెక్ట్ అయ్యాక ఒక ఈవెంట్‌లో శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. నాకు ఇప్పుడు ఒక కొత్త రెస్పాన్సిబిలిటీ దక్కింది. అంతమాత్రాన నేను నా పర్సనాలిటీని మార్చుకోను.. నేను ముందెలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉంటాను.. వేరే ఎవరిలాగో నటించడం గానీ, లేదా ఎవరి నీడలోనో (Shadow) ఉండిపోవడం గానీ నాకు ఇష్టం లేదని పబ్లిక్‌గా శ్రేయస్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.

గౌతమ్ గంభీర్‌ను ఉద్దేశించేనా:
శ్రేయస్ అయ్యర్ 'ఎవరి నీడలో ఉండను' అనగానే క్రికెట్ ఫ్యాన్స్‌కు ఒక్కసారిగా డౌట్ వచ్చింది. ఐపీఎల్ 2024 లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) టీమ్ కప్ గెలిచినప్పుడు శ్రేయస్ కెప్టెన్‌గా ఉన్నాడు, గౌతమ్ గంభీర్ మెంటార్‌గా ఉన్నాడు. అయితే ఆ గెలుపు క్రెడిట్ మొత్తం గంభీర్‌కే వెళ్లడంపై అయ్యర్ అప్పట్లో హ్యాపీగా లేడనే టాక్ నడిచింది. ఇప్పుడు గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న టైమ్‌లోనే.. శ్రేయస్ చేసిన వ్యాఖ్యలు గంభీర్‌ను ఉద్దేశించేనంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తుంది. 

అందుకే కెప్టెన్సీ ఛాన్స్: 
టీ20 వరల్డ్ కప్ 2026 స్క్వాడ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు ప్లేస్ దక్కలేదు.. కానీ ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ తరఫున బ్యాట్‌తో మాత్రం మనోడు చెలరేగిపోయాడు. తన టీమ్‌ను ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లలేకపోయినప్పటికీ.. ఒక బ్యాటర్‌గా 13 ఇన్నింగ్స్‌ల్లో 165+ స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 498 రన్స్ కొట్టాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ కూడా ఉంది. ఈ కిర్రాక్ పర్ఫార్మెన్స్ చూసే బీసీసీఐ అతనికి ఇంగ్లాండ్, ఐర్లాండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్ 2026 కు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది.