
న్యూఢిల్లీ: చాన్స్ దొరికిన ప్రతిసారి కీలక ఇన్నింగ్స్ ఆడుతూ ఇప్పుడిప్పుడే జట్టులో స్థానం సుస్థిరం చేసుకుంటున్న శ్రేయస్ అయ్యర్
తన మనసులో టీమిండియా కెప్టెన్సీ ఆలోచన ఉందని చెప్పాడు. ఇండియా కెప్టెన్ గా మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ఊహించుకున్నారా అనే
ప్రశ్నకు బదులిస్తూ.. ‘కెప్టెన్సీ ఆలోచనైతే ఉంది. కానీ దానికోసమే ఎప్పుడూ ఆలోచించను. వర్తమానంలో ఉండడానికే ఎప్పడూ ఇష్టపడతా. అదేపనిగా కెప్టెన్సీ కోసం ఆలోచించను. ఈ క్షణాన్ని ఎలా ఎంజాయ్ చేయగలనో ఆలోచిస్తా’ అని అయ్యర్ బదులిచ్చాడు. ఐపీఎల్‌లో గత రెండు సీజన్లలో అతను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఉన్నాడు.
For More News..