అయోధ్య రామాలయం గర్భగుడిలో అద్భుత శిల్పాలు

అయోధ్య రామాలయం గర్భగుడిలో అద్భుత శిల్పాలు

ఉత్తరప్రదేశ్: అయోధ్యలోని రామ మందిరం గర్భగుడి-గర్భస్థలం లోపలి భాగాన్ని అలంకరించిన అద్భుతమైన శిల్పాల ఆకర్షణీమైన ఫొటోలను  రామ జన్మభూమి ట్రస్టు ఆదివారం విడుదల చేసింది. రాముని విగ్రహం ప్రతిష్టించబడే పవిత్ర స్థలం నిర్మాణం ముగింపు దశకు చేరుకుందని ఆలయంలో అద్భతమైన నిర్మాణానికి సంబంధించిన తాజా చిత్రాలను ట్రస్ట్ షేర్ చేసింది. 2023 అక్టోబర్ నెలలో ఆలయంలో  నేల పొదుగు  పనుల ఫొటోలను  షేర్ చేసింది రామజన్మభూమి ట్రస్ట్. 

రామమందిరానికి చెందిన గొప్ప సాంస్కృతిక, మత పరమైన ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ..గర్భగుడి, గర్భస్థలం  లోపల కళాత్మకతకు సంబంధించి ఈ చిత్రాలు అద్దం పడుతున్నాయి. రామమందిరం గుండెగా భావించే గర్భగుడి-గర్భస్థలం నిర్మాణం కోసం ఊహించిన  నిర్మాణ వైభవానికి ఈ ఫొటోలు నిదర్శనం.

‘‘ శ్రీరాంలాలా  దేవుడి గర్భగుడి దాదాపుగా సిద్దమైంది. ఇటీవలే లైటింగ్ పనులు పూర్తయ్యాయని’’ ట్రస్ట జనరల్ సెక్రటరీ చంపత్ రాయ ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. వచ్చే ఏడాది అంటే జనవరి 22 (2024 జనవరి 22)మధ్యాహ్నం 12.45 గంటల మధ్య   మందిరం గర్భగుడిలో రామ్ లాలాను ప్రతిష్టించాలని రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ నిర్ణయించింది. ఈ వేడుకలకు అన్ని వర్గాల నుంచి 4వేల మంది సాధువులను ట్రస్ట్ ఆహ్వానించింది. ముఖ్యఅతిథిగా ప్రధాని మోదీ హాజరు కానున్నారు. 

రామ్ లల్లా (శివుడురాముడు)   ప్రతిష్టాపన వేడుకకు సంబంధించిన వైదిక ఆచారాలు 2024 జనవరి 16 నుంచి ఒక వారం ముందు ప్రారంభవం అవుతాయి. వారణాసిక చెందిన దేవ పూజారి లక్ష్మీ కాంత్ దీక్షిత్ జనవరి 22న రామ్ లల్లాకు పట్టాభిషేకం ప్రధాన క్రతువులను నిర్వహించనున్నారు.