శృతికి ఆ అలవాటు ఉందా?

శృతికి ఆ అలవాటు ఉందా?

స్టార్​ హీరో వారుసురాలిగా గ్రాండ్​ ఎంట్రీ ఇచ్చినా తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకుంది శృతి హాసన్​. కెరీర్​ తొలినాళ్లలో వరుస ఫ్లాపులు ఆమెను పలకరించినా ధైర్యంగా నిలదొక్కుకుంది. బలుపు, ఎవడు, రేసుగుర్రం వంటి హిట్లతో దూసుకొచ్చింది. ఈ బ్యూటీ లైఫ్​స్ట్రైల్​, వైరైటీ డ్రెస్సింగ్​ చూసిన వారు వెస్ట్రన్​ కల్చర్​ను ఫాలోఅవుతుందని అనుకుంటారు. ఇదే విషయమై ఓ నెటిజన్​ ఆమెను ప్రశ్నించాడు. 

మీకు మందు తాగే అలవాటుందా? అంటూ లైవ్​లోనే అడిగేశాడు. దీనికి శృతి ఇచ్చిన బోల్డ్​ ఆన్సర్​ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘నేను మందు తాగను. డ్రగ్స్​ కూడా తీసుకోను. అలాంటి అలవాట్లు కూడా లేవు. జీవితాన్ని ఉన్నంతలో హుందాగా గడపడం అంటేనే నాకు ఇష్టం’ అంటూ ఆ నెటిజన్​కు సమాధానమిచ్చింది. ప్రస్తుతం శృతి ప్రభాస్​తో ‘సలార్​’లో నటిస్తోంది. ఈ సినిమా హిట్​ అయితే ఈ అమ్మడి కెరీర్​ ఓ రేంజ్​లో వెలిగిపోవడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.