
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయనున్నారు. మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇవాళ చిత్ర యూనిట్ విశాఖ ఆర్కే బీచ్ తీరంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది. అయితే ఈ ఈవెంట్ కు హీరోయిన్ శృతిహాసన్ హాజరుకావడం లేదట. ఈ విషయాన్ని స్వయంగా తానే ప్రకటించింది. అనారోగ్యం వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా శృతి తెలిపింది. ఈవెంట్ ను చాలా మిస్ అవుతున్నానని విచారం వ్యక్తం చేసింది.
జనవరి 13న రిలీజ్ అవుతోన్న ఈ మూవీలో చిరు జాలరీ పాత్రలో కనిపిస్తుండగా, రవితేజ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో కేథరిన్, బాబీ సింహా, నాజర్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఇటీవలె రిలీజైన ఈ మూవీ ట్రైలర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. గాడ్ ఫాదర్ తర్వాత చిరు నటిస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.