సస్పెన్స్‌‌ డ్రామాగా శుభకృత్ నామ సంవత్సరం

సస్పెన్స్‌‌ డ్రామాగా శుభకృత్ నామ సంవత్సరం

వీకే నరేష్‌‌  ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం  ‘శుభకృత్ నామ సంవత్సరం’.  ఎస్‌‌ఎస్‌‌ సజ్జన్‌‌ దర్శకత్వంలో  విశ్వనాథ్ నాయక్ నిర్మిస్తున్నారు.  సోమవారం ఈ మూవీ గ్లింప్స్‌‌ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన  హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ ‘నరేష్ గారు  ప్రతి సినిమాకి ఒక వేరియేషన్ ఇస్తున్నారు.  కొత్త  డైరెక్టర్స్‌‌ని ప్రోత్సహిస్తున్నారు.  ఆయన సినిమాలో ఉంటే చాలు అనే ఒక ఇమేజ్‌‌ని క్రియేట్ చేసుకున్నారు.  ఏ పాత్ర అయినా సరే అద్భుతంగా చేయగలిగే నటుడు.  ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని అన్నాడు. 

నరేష్ మాట్లాడుతూ ‘అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమా ఇది.  డ్రామా,  సస్పెన్స్,  ట్రావెల్ ఇలా  చాలా వేరియేషన్స్ ఉంటాయి. తెలుగు,  కన్నడలో చాలా మంచి స్టార్ కాస్ట్‌‌తో వస్తున్న ఈ సినిమా   టైటిల్ వినగానే అందరూ  పాజిటివ్‌‌గా ఉందని చెప్పారు. మంచి   విజయం సాధించే అన్ని అర్హతలు ఉన్న ఈ సినిమా  కొన్నేళ్లపాటు గుర్తుండిపోతుంది’ అని అన్నారు.  ఇదొక అద్భుతమైన కాన్సెప్ట్ అని,  ఇందులో  నరేష్ గారు  డిఫరెంట్ క్యారెక్టర్‌‌‌‌లో కనిపించబోతున్నారని  చిత్ర దర్శకుడు సజ్జన్ చెప్పాడు.  మంచి కథతో నిర్మాతగా పరిచయం అవడం ఆనందంగా ఉందని నిర్మాత విశ్వనాథ్​ నాయక్ అన్నారు. దర్శకుడు రామ్ అబ్బరాజు, నిర్మాత రాజేష్ దండా కార్యక్రమంలో పాల్గొని టీమ్‌‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.