పాక్ కెప్టెన్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన గిల్

పాక్ కెప్టెన్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన గిల్

టీమీండియా ఓపెనర్  బ్యాట్స్ మెన్ శుభ్‌మన్ గిల్ ఆరుదైన రికార్డు సృష్టించాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్  పేరిట ఉన్న  ప్రపంచ రికార్డును గిల్ అదిగమించాడు.  బార్బోడస్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్ ను సమం చేసింది  వెస్టిండీస్‌. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా ఘోరంగా నిరాశ పరిచింది. 

అయితేఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయినప్పటికీ శుభ్‌మన్ గిల్అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో 26 ఇన్నింగ్స్‌లు తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.  ఇప్పటివరకు 26 మ్యాచ్‌లు ఆడిన గిల్‌.. 1352 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్ ను గిల్‌ అధిగమించాడు. 

బాబర్‌ తన మొదటి 26 ఇన్నింగ్స్‌లలో 1322 పరుగులు చేశాడు. ఆ తరువాతి స్థానాల్లో జోనాథన్ ట్రాట్ (1303), ఫఖర్ జమాన్ (1275), రాస్సీ వాన్ డెర్ డుసెన్ (1267) ఉన్నారు.