IPL: కోహ్లీ కంటే గిల్ తక్కువేమి కాదు.. ఆ విషయంలో ఇద్దరూ సేమ్: భారత మాజీ క్రికెటర్

IPL: కోహ్లీ కంటే గిల్ తక్కువేమి కాదు.. ఆ విషయంలో ఇద్దరూ సేమ్: భారత మాజీ క్రికెటర్

ఐపీఎల్ 18లో అద్భుత ఫామ్‎లో ఉన్న గుజరాత్ కెప్టెన్, యంగ్ బ్యాటర్ శుభమన్ గిల్‎పై భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ప్రశంసలు కురిపించారు. శుభమన్ గిల్‎ను ఏకంగా టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో పోల్చాడు. ఐపీఎల్ 18లో భాగంగా శుక్రవారం (మే 2) గుజరాత్, హైదరాబాద్ తలపడ్డాయి. బ్యాటింగ్, బౌలింగ్‎లో విభాగాల్లో అదరగొట్టి సన్ రైజర్స్ హైదరాబాద్‎ను చిత్తు చేసింది జీటీ. ఈ మ్యాచులో శుభమన్ గిల్ హాఫ్ సెంచరీతో కెప్టెన్ ఇన్సింగ్ ఆడాడు. ఈ సీజన్‎లో గిల్‎కు ఇది ఐదో అర్ధ సెంచరీ. ఈ నేపథ్యంలో గిల్‎ను జడేజా ఆకానికెత్తారు. 

‘‘నిలకడగా రాణించడంలో గిల్ కూడా కోహ్లీ మాదిరే. పరిస్థితులను అర్ధం చేసుకుని దానికి తగ్గట్లుగా ఆడటంలో కోహ్లీ దిట్ట. గిల్ కూడా సేమ్ కోహ్లీ లాగే.. పరిస్థితులను అంచనా వేసి ఆడుతాడు. నిలకడ విషయంలో కోహ్లీ కంటే గిల్ తక్కువేమి కాదు. బ్యాటింగ్‎లో కోహ్లీ, గిల్ ఇద్దరూ అనవసరమైన రిస్క్‌లు తీసుకోరు. బౌలర్ తప్పు చేసే వరకు వేచి చూస్తారు. ఖచ్చితంగా అవసరమైతే తప్ప అనవసర షాట్లకు వెళ్లరు. కోహ్లీ, గిల్ తమ వికెట్‌ను అంత ఈజీగా సమర్పించుకోరు’’ అని అన్నారు జడేజా. గిల్ స్కిల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

ఎస్ఆర్‎హెచ్‎పై ఆఫ్ సైడ్ అతడు కొట్టిన కవర్ డ్రైవ్‌ల ఇందుకు నిదర్శనమన్నారు. ఇక, ఈ సీజన్‎లో కెప్టెన్‎గా, బ్యాటర్‎గా అద్భుతంగా రాణిస్తు్న్నాడు. ఈ సీజన్‎లో గిల్ 10 మ్యాచ్‌ల్లో 465 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో నిలవగా.. గుజరాత్ జట్టును పదింట్లో ఏడు మ్యాచుల్లో గెలిపించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలబెట్టాడు. లీగ్ స్టేజ్‎లో ఇంకా నాలుగు మ్యాచులు ఆడాల్సి ఉండగా.. ఇందులో ఒక విజయం సాధిస్తే జీటీ ప్లే ఆఫ్స్‎కు  చేరుకుంటుంది. ప్రస్తుతం జీటీ ఉన్న ఫామ్ ను బట్టి చూస్తే ఇది పెద్ద కష్టమేమి కాదనిపిస్తోంది.