IND vs AUS: ప్లేయర్‌గానే జట్టులో రోహిత్.. టీమిండియా కొత్త వన్డే కెప్టెన్‌గా గిల్

IND vs AUS: ప్లేయర్‌గానే జట్టులో రోహిత్.. టీమిండియా కొత్త వన్డే కెప్టెన్‌గా గిల్

భారత క్రికెట్ లో బీసీసీఐ మరో కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభమాన్ గిల్ కు వన్డేల్లో కూడా సారధ్య బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం టీమిండియా వన్డే కెప్టెన్ గా ఉంటున్న రోహిత్ శర్మ స్థానంలో గిల్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. గిల్ ఇండియా వన్డే కెప్టెన్ గా ప్రకటిస్తున్నట్టు శనివారం (అక్టోబర్ 4) అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు రోహిత్ స్థానంలో గిల్ కు వన్డే పగ్గాలు చేపట్టనున్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు రోహిత్ శర్మ కేవలం ప్లేయర్ గా మాత్రమే కొనసాగనున్నాడు.  

2027 వన్డే ప్రపంచ కప్ ను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత టెస్ట్ కెప్టెన్ గిల్ ను వన్డే సారధిగా ఉంచాలని సెలక్టర్లు భావించారు. ఈ విషయాన్ని సెలక్టర్లు గిల్ కు తెలియజేసినట్టు సమాచారం. ప్రస్తుతం వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో గిల్ కెప్టెన్సీ చేస్తున్న గిల్ వన్డేల్లోనూ తన కెప్టెన్ తో అదరగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆస్ట్రేలియా టూర్ లో భాగంగా వన్డే జట్టులో సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులో ప్లేయర్లుగా కొనసాగనున్నారు. ఇటీవలే జరిగిన ఆసియా కప్ లోనూ గిల్ కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.  

ALSO READ : అహ్మదాబాద్ టెస్టు మనదే..

చివరిసారిగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్ నుంచి దూరమైన హిట్ మ్యాన్ వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. మూడు ఫార్మాట్ లకు ముగ్గురు కెప్టెన్ లను కొనసాగడం బీసీసీఐ ఆలోచనల్లో లేనట్టు స్పష్టమవుతుంది. రోహిత్ శర్మ ప్రస్తుత వయసు 37 సంవత్సరాలు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ ఆడడం దాదాపుగా ఖాయమైంది.  ఫిట్ నెస్ లో హిట్ మ్యాన్ కు సమస్యలు ఉన్నాయి. ఇటీవలే ఐపీఎల్ లో సైతం రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగాడు. దీంతో పాటు ఇప్పటి నుంచే గిల్ కు కెప్టెన్ గా అవకాశమిస్తే 2027 వరల్డ్ కప్ లోపు అనుభవాన్ని సంపాదించుకుంటాడనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు సమాచారం.