విదేశాల్లో విజయాలకు ఆ ముగ్గురూ బాట వేశారు : గిల్

విదేశాల్లో విజయాలకు ఆ ముగ్గురూ బాట వేశారు : గిల్
  • రోహిత్, విరాట్ నాయకత్వ శైలి భిన్నం

ముంబై: విదేశాల్లో టెస్ట్లు గెలవడా నికి అవసరమైన బ్లూ ప్రింట్ను..రో హిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్ తమకు ఇచ్చారని టీమిండియా కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ అన్నాడు. దాన్ని తాము సమర్థంగా అమలుచేయాలన్నాడు. ఇక రోహిత్, విరాట్ నాయకత్వ శైలి చాలా భిన్నంగా ఉంటాయన్నాడు. 'మా వద్ద ఉన్న బ్లూ ప్రింట్ను సమ ర్థంగా అమలు చేయాలి. అది ఉండటం వల్ల విదేశాల్లోమ్ యాచ్లు, సిరీస్లు ఎలా గెలవాలో మాకు తెలుసు. నేను చిన్న ప్పుడు ఇండియా క్రికె ట్లోని గొప్ప లెజెండ్స్ నుంచి ప్రేరణ పొందాను. వారిలో చాలా మందితో కలిసి ఆడే అదృష్టం 

కూడా లభించింది. అది రోహిత్, విరాట్ భాయ్ కావొచ్చు. ఇద్దరి నాయకత్వ శైలి భిన్నంగా ఉంటుంది. కానీ వారిద్దరూ ఓ లక్ష్యం కోసం పని చేస్తున్నప్పుడు చూడటం చాలా స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది. కెప్టెన్గా మనం గెలవాలనుకున్నప్పుడు మన శైలి భిన్నంగా ఉండొచ్చు. విరాట్ ఎప్పుడూదూకుడుగా ఉండేవాడు. గెలవాల న్న అభిరుచితో టీమ్ను నడిపించేవాడు. రో హిత్ కూడా దూకుడుగా ఉన్నా బయటకు కనిపించేది కాదు' అని గిల్ పేర్కొన్నాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే రోహిత్..ప్లే యర్లతో ఎక్కువగా సంభాషించేవాడన్నాడు. ప్లేయర్ల నుంచి ఏం కోరుకుంటున్నాడోస్ప ష్టంగా చెప్పేవాడన్న గిల్ ఆ లక్షణాన్ని తాను కూడా నేర్చుకున్నానని తెలిపాడు. కెప్టెన్సీ భారం బ్యాటింగ్ను ప్రభావితం చేస్తుంది. కానీ తాను ఆ రెండింటిని వేర్వేరుగా ఉంచా 

లనుకుంటున్నానని చెప్పాడు. ఒకవేళ తాను బ్యాటింగ్కు వెళ్లినప్పుడు కెప్టెన్గా కాకుండా బ్యాట్స్మన్ గానే నిర్ణయాలు తీసుకుంటాన నని అన్నాడు. ఇతర విషయాల గురించి ఆలోచిస్తే తనపై మరింత ఒత్తిడి పెరుగుతుం దన్నాడు. టెస్టు కెప్టెన్గా నియమించడం పెద్ద బాధ్యతనేనని గిల్ వ్యాఖ్యానించాడు. 'చిన్న పిల్లాడిగా ఎవరైనా క్రికెట్ ఆడటం ప్రారంభించి నప్పుడు ఇండియా తరఫున ఆడాలని కోరుకుంటాం. ఆ తర్వాత ఎక్కువ కాలం ఉండాలని అనుకుంటాం. కానీ నాకు కెప్టెన్సీ రూపంలో గొప్ప గౌరవం లభించింది. ఇదో పెద్ద బాధ్యత. ఈ అవకాశం కోసం నేనూ ఉత్సాహంగానే ఎదురుచూస్తున్నా. ఇంగ్లండ్ సిరీస్ చాలా ఉత్సాహంగా ఉంటుందని భావిస్తున్నా. కెప్టెన్గా టీమ ను నడిపించడమే కాకుండా ప్లేయర్లకు వ్యక్తిగతంగా అవసరమైన అన్ని అవకాశాలూ  అని  చెప్పుకొచ్చాడు