
దుబాయ్: ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (జులై) అవార్డుకు నామినేట్ అయ్యాడు. సౌతాఫ్రికా ప్లేయర్ వియాన్ ముల్డర్, ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా రేసులో ఉన్నారు. ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీలో గిల్ తన బ్యాటింగ్‌తో కొత్త రికార్డులను సృష్టించాడు. ఈ సిరీస్‌లో నాలుగు సెంచరీలతో 754 రన్స్ చేశాడు. ఇండియా కెప్టెన్‌గా అత్యధిక రన్స్ చేసిన సునీల్ గావస్కర్ (732) రికార్డును బ్రేక్ చేశాడు. ఆల్‌టైమ్ లిస్ట్‌లో బ్రాడ్‌మన్ (810) టాప్‌లో ఉండగా, గిల్ రెండో ప్లేస్‌లో నిలిచాడు.
‘జులైలో గిల్ పరుగుల వరద పారించాడు. మూడు టెస్ట్‌ల్లో 94.50 యావరేజ్‌తో 567 రన్స్ సాధించాడు. ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆల్ టైమ్ గ్రేట్ కోహ్లీ ఆడిన నాలుగో నంబర్‌కు గిల్ సరైన న్యాయం చేకూరుస్తున్నాడు’ అని ఐసీసీ పేర్కొంది. సౌతాఫ్రికా కెప్టెన్‌గా ముల్డర్.. జింబాబ్వేపై 367 రన్స్ చేశాడు. 2004లో ఇంగ్లండ్‌పై లారా నెలకొల్పిన అత్యధిక రన్స్ (400) రికార్డును బద్దలు కొట్టే చాన్స్ వచ్చినా తన జట్టు ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. బాల్‌తోనూ ముల్డర్ ఏడు వికెట్లు తీశాడు. స్టోక్స్ ఇండియాపై ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్ చూపెట్టాడని ఐసీసీ వెల్లడించింది. 50.21 సగటుతో 251 రన్స్ చేశాడు.