Shubman Gill: గిల్‌కు ఫుడ్ పాయిజనింగ్.. విజయ్ హజారేకి దూరం.. న్యూజిలాండ్ సిరీస్ ఆడతాడా..?

Shubman Gill: గిల్‌కు ఫుడ్ పాయిజనింగ్.. విజయ్ హజారేకి దూరం.. న్యూజిలాండ్ సిరీస్ ఆడతాడా..?

టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభమాన్ గిల్ కు బిగ్ షాక్ తగిలింది. గాయం తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడి న్యూజిలాండ్ సిరీస్ కు సిద్ధమవ్వాలని భావించిన గిల్ కు నిరాశే ఎదురైంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఫుడ్ పాయిజనింగ్ కారణంగా విజయ్ హజారీ ట్రోఫీలో సిక్కింతో ఆడాల్సిన మ్యాచ్ కు ఈ టీమిండియా కెప్టెన్ దూరం కానున్నాడు. గత నెలలో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో గాయపడిన గిల్.. ఈ క్రమంలో నాలుగు, ఐదు టీ20 మ్యాచ్ లు ఆడలేదు. గాయం నుంచి కోలుకున్నాడనుకునుంటే దురదృష్టవశాత్తు ఇప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అయింది. 

గిల్ తన చివరి విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌ను 2018 సీజన్‌లో ఆడాడు. ఈ సీజన్ లో పంజాబ్ తరపున ఓవరాల్ గా 7 మ్యాచ్ లాడి  59.71 సగటుతో 418 పరుగులు చేశాడు. ఏడేళ్ల తర్వాత మరోసారి విజయ్ హజారే ట్రోఫీ ఆడదామని భావించిన ఈ టీమిండియా వన్డే కెప్టెన్ కు ఊహించని షాక్ తగిలింది. 2025లో ఆస్ట్రేలియా సిరీస్ తో తొలిసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన గిల్.. బ్యాటర్ గా విఫలమయ్యాడు. ఆ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ కు మెడ గాయం కారణంగా ఆడలేకపోయాడు. జనవరి 11 నుంచి కివీస్ తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కు శుభమాన్ అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తుంది.

న్యూజిలాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే జట్టును శనివారం (జనవరి 3) ఎంపిక చేయడానికి ఆల్-ఇండియా సీనియర్ మెన్స్ సెలక్షన్ కమిటీ సిద్ధంగా ఉంది. అజిత్ య్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2026 టీ20 వరల్డ్ కప్ కు శుభమాన్ గిల్ పై వేటు పడిన సంగతి తెలిసిందే. ఆసియా కప్ 2025 నుంచి గిల్ ను బలవంతంగా ఓపెనర్ గా కొనసాగించినా వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడంలో గిల్ విఫలమయ్యాడు. ఫామ్ లేక ఇబ్బందిపడుతున్న గిల్ పై సెలక్టర్లు కఠిన నిర్ణయం తీసుకుని జట్టు నుంచి తప్పించారు. నమ్మకంతో ఎన్ని అవకాశాలు ఇచ్చినా శుభమాన్ వరుసగా విఫలమవుతూ జట్టుకు భారంగా మారాడు.

ఆసియా కప్ నుంచి గమనిస్తే గిల్ ఒక్కసారి కూడా హాఫ్ సెంచరీ మార్క్ అందుకోలేకపోయారు. కాన్‌‌‌‌‌‌‌‌బెరాలో తొలి టీ20లో మాత్రమే కెప్టెన్ సూర్యతో కలిసి కాస్త మెప్పించాడు. ఆ తర్వాత నాలుగో వన్డేలో 46 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో కేవలం 4 పరుగులే చేసి పెవిలియన్ కు చేరాడు. అడపాదడపా ఇన్నింగ్స్ లు తప్పితే గిల్ పెద్దగా రాణించలేదు. దీంతో టీ20 ఫార్మాట్ లో గిల్ ను తప్పించారు. ప్రస్తుతం శుభమాన్ టీమిండియాకు వన్డే, టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతున్నాడు.