ఐడియా అదిరింది..బిజినెస్ పెరిగింది

ఐడియా అదిరింది..బిజినెస్ పెరిగింది

చెఫ్ అవ్వాలనేది ఆమె చిన్ననాటి కల. సినిమాఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యే కమైన గుర్తింపుతెచ్చుకోవాలన్నది అతని ఆశ. ఇద్దరు బాల్య స్నేహితులు. కానీ ఇరువురి లక్ష్యాలు భిన్నం .అయితే అనుకోని సంఘటన వారిద్దరిని బిజినెస్ పార్ట్‌‌‌‌నర్స్‌ గా మార్చింది. ఇప్పుడు సిటీలో ఆన్‌ లైన్‌ బేకర్స్ లో మంచి పేరుని తెచ్చిపెట్టింది. వారే నగరానికి చెందిన జైనాబ్, రోహిత్ లు. ఒకరు సివిల్ ఇంజనీర్, మరొకరు చెఫ్. సీన్ కట్ చేస్తే ఇప్పుడు రుచికరమైన బేకరీ ఐటమ్స్ ని కార్పొ రేట్‌‌‌‌ సంస్థలకు, నగరవాసులకు అందిస్తూ సక్సెస్‌‌ఫుల్ జర్నీనిలీడ్ చేస్తున్నారు. అసలు వీరి బేకరీ జర్నీ ఎలామొదలైంది? ఎలాంటి ప్రొడక్స్ట్ తయారుచేస్న్తు నారోతెలుసుకోవాలంటే చదవండి .

అనుకోకుండా…

వెస్ట్ మారేడ్ పల్లికి చెందిన జైనాబ్ హోటల్మేనేజ్‌ మెంట్‌‌‌‌ కోర్స్ చేశారు. రోహిత్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి సినిమా ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో చేరారు. అయితే రోహిత్   డైరెక్షన్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో అనుకున్నంత సక్సెస్ రాలేదు. అందులో నుంచి బయటకురావాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు జైనాబ్ తన బేకరీ ఐడియాని చిన్ననాటి స్నేహితుడైన రోహిత్ తో షేర్ చేసుకున్నారు. తనకి మార్కె టింగ్ సహాయం చేయమని, కలిసి పనిచేద్దామని కోరారు. అలా 2016లో షుగర్ డాడీ బేకరీకి శ్రీకారం చుట్టారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని ఓ అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లోని పెంట్ హౌజ్ లో ప్రొడక్షన్ స్టార్ట్చేశారు. ముందుగా స్నేహితులకు, తెలిసినవాళ్లకి తమ కేక్స్ ని, బేకరీ ఐటమ్స్ ని ఫ్రీగా ఇచ్చారు. అలా స్నేహితులు, బంధువులు ఇతరులకు చెప్పడంతో, మౌత్ పబ్లిసిటీ ద్వారా వీరిప్రొడక్స్ట్ కు ఆదరణ లభించింది. దీంతో ఆన్‌లై న్‌ వేదికగా ఆర్డర్లు తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఇక అప్పటి నుంచి వెను తిరిగి చూసుకోలేదు. టేస్ట్అండ్ క్వాలి టీ బాగుండటంతో కార్పొ రేట్‌‌‌‌ సంస్థలు సైతం క్యూ కట్టాయి. ప్రస్తుతం 12కిపైగా కార్పొ రేట్‌‌‌‌ సంస్థలకు బేకరీ ఐటమ్స్ నిఆర్డర్లపై చేసి ఇస్తున్నారు

తింటే ఆహా అనాల్సిందే..

వీరి ప్రొడక్షన్ హౌజ్ చూస్తే ఇక అక్కడి నుంచి బయటకు రాలేరు. కస్టమర్లకు బేకింగ్ ఎలాచేస్తామో లైవ్ లో చూపించాలనే ఉద్దేశంతో తమ ప్రొడక్షన్ హౌజ్ ని ఎంతో అందంగా తీర్చిదిద్దారు. అక్కడే కిచెన్ లో ఐటమ్స్ ఎలా చేస్తారో దగ్గరుండి చూసే వీలుని కల్పిస్తున్నారు. సమ్మర్ స్పెషల్ థిక్ మిల్క్ షేక్లు, కప్ కేక్ లు, కేక్ లు, పిజ్జా లు, బర్గర్ లు,పఫ్ లు ఇలా ఒక్కటే మిటి బేకరీ ఐటమ్స్ లోప్రతి ఒక్కటీ వీరి వద్ద లభిస్తుంది. వీరి టీమ్లో ఉండేది ఐదుగురు మాత్రమే. ఇందులో నలుగురూ మహిళలే. వారే పగలనకా,రాత్రనకా శ్రమించి కస్టమర్లు కోరుకున్న టైంకిడెలివరీ చేస్తుంటారు. అవసరానికి అనుగుణంగా టీం ని బిల్డప్ చేసుకుంటూ ప్రస్తుతం నగరంలో బేక్స్ లో లీడ్ లో ఉన్నారు.ఇండివిజ్యువల్ కస్టమర్లకు మాత్రమే కాకుండాబేకరీస్ కు కూడా ఐటమ్స్ ని సప్లై చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. త్వరలోనే గోవాలో తమ రెండో బ్రాంచ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు షుగర్ డాడీ బేక్స్ నిర్వాహకుల్లోఒకరైన రోహిత్. గోవా బెస్ట్ టూరిజం ప్లేస్ కావడంతో తమ వ్యా పారం మరింత విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Hyd,online,cheff,rohith,jynab,westmaredpally,friends, shugar dady,bakers