లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్సై, కానిస్టేబుల్

లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్సై, కానిస్టేబుల్

కేసులు పెట్టకుండా ఉండేందుకు నిందితులతో డీల్‌‌

చీటింగ్‌ కేసు నిందితుడి వద్ద రూ.50 వేలు డిమాండ్‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కానిస్టేబుల్‌‌‌‌తో కలిసి అవినీతికి పాల్పడుతూ ఎస్సై.. ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. రూ.30 వేలు లంచం తీసుకుంటూ కానిస్టేబుల్‌‌‌‌ నరేశ్‌‌‌‌తో పాటు గాంధీనగర్‌‌‌‌ ఎస్సై లక్ష్మీనారాయణ రెడ్‌‌‌‌హ్యాండెడ్‌‌‌‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ డిప్యూటీ  డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ రమణకుమార్‌‌‌‌ ‌‌‌‌తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ సిటీ పోలీస్‌‌‌‌ కమిషనరేట్‌‌‌‌పరిధిలోని గాంధీనగర్‌‌‌‌ ‌‌‌‌పీఎస్‌‌‌‌లో ఎం.లక్ష్మీనారాయణ  ఎస్సైగా పనిచేస్తున్నాడు. నోయిడాకు చెందిన నేషనల్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ స్కూల్‌‌‌‌ ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌సీ ఫేక్‌‌‌‌ సర్టిఫికెట్లు కేసులో ఆగస్ట్‌‌‌‌ 17న కేసు నమోదైంది. ఈ చీటింగ్‌‌‌‌ కేసులో  హబ్సీగూడకు చెందిన ఎం.సంతోశ్ రెడ్డిని లక్ష్మీనారాయణ అరెస్ట్‌‌‌‌ చేసి రిమాండ్‌‌‌‌కి తరలించాడు. గత నెల 9న బెయిల్‌‌‌‌పై రిలీజైన సంతోశ్ రెడ్డిపై మరికొన్ని కేసులు ఫైల్ చేస్తానని, అలా చేయకుండా ఉండాలంటే రూ.50 వేలు ఇవ్వాలని  ఎస్సై లక్ష్మీనారాయణ బెదిరించాడు. సంతోశ్ రెడ్డి రిక్వెస్ట్‌‌‌‌తో ఫైనల్​గా రూ.30 వేలకు డీల్‌‌‌‌ కుదుర్చుకున్నాడు. ఎస్సై టార్చర్ భరించలేక బాధితుడు ఏసీబీకి ఇన్ఫామ్ చేయడంతో కేసు రిజిస్టర్‌‌‌‌‌‌‌‌ చేసిన డీఎస్పీ సత్యనారాయణ టీమ్ ట్రాప్‌‌‌‌ స్కెచ్‌‌‌‌ వేసింది. బుధవారం గాంధీనగర్‌‌‌‌‌‌‌‌ పీఎస్‌‌‌‌ దగ్గర నిఘా పెట్టింది. కానిస్టేబుల్‌‌‌‌ నిమ్మల నరేశ్‌‌‌‌ లంచం తీసుకుని ఎస్సైకి ఇస్తుండగా ఆఫీసర్లు పట్టుకుని.. రు. రూ.30 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై, కానిస్టేబుల్‌‌‌‌ను కోర్టులో ప్రొడ్యూస్‌‌‌‌ చేయగా 14 రోజుల రిమాండ్‌‌‌‌ విధించడంతో చంచల్‌‌‌‌గూడ జైలుకి తరలించారు.

For More News..

వనభోజనాల్లో విషాదం.. ఈతకు పోయి ఆరుగురు మృతి