కాగజ్ నగర్, వెలుగు: ఐపీఎల్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకున్న యువకుడు బలవన్మరణానికి పాల్పడుతుండగా అడ్డుకునేలా ఆసిఫాబాద్ జిల్లా కౌటాల ఎస్సై చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెల రోజులుగా నడుస్తున్న ఐపీఎల్ జరుగుతుండగా క్రికెట్ మోజులో పల్లె యువత బెట్టింగ్లకు బానిసలై ఆర్థికంగా నష్టపోతున్నారు. అప్పులు పాలై ప్రాణాలు తీసుకుంటున్నారు.
ఈనేపథ్యంలోనే ఎస్సై చంద్రశేఖర్చొరవ తీసుకుని స్థానిక యువకులతో రీల్స్ చేసి మంగళవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓ యువకుడు ఐపీఎల్ లో బెట్టింగ్ పెట్టి డబ్బులు పోగుట్టుకొని బలవన్మరణానికి ప్రయత్నిస్తుండగా ఎస్సై అడ్డుకున్నారు. క్రికెట్ మీద అభిమానం ఉండాలి కానీ, బెట్టింగ్ లకు బానిసలై జీవితాలను పాడుచేసుకోవద్దని వీడియో ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

