శీతాకాలం విడిది కోసం ఎప్పటిలానే ఈ సారి కూడా అతిథులు వచ్చేశాయ్. ఆ అతిథులు ఎవరంటే..సైబీరియా నుంచి వచ్చిన వలస పక్షులు. నిర్మల్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో ఉన్న కడెం, ఉడుంపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని దట్టమైన అడవుల్లో ఈ వలస పక్షులు సందడి చేస్తున్నయ్. వాతావరణ మార్పుల వల్ల నార్త్ ఇండియా నుండి రకరకాల పక్షులు ఇక్కడికి వస్తున్నాయ్. వాటిలో బ్లాక్ హెడెడ్ ఇబిస్, రెడ్ నేపిడ్ ఇబిస్, ఆసియన్ ఓపెన్ బిల్ స్టోర్క్, గ్రేహెరొన్, క్రేస్టేట్ హాక్ ఈగల్, కామన్ కింగ్ ఫిషర్, బ్రహ్మిణి కైట్ వంటి పక్షులు ఉన్నాయి. అవి చెరువులు, కుంటలు, వాగులు ఉండే ప్రదేశాల్లో చక్కగా సేదతీరుతున్నాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో శీతాకాల విడిది కోసం వచ్చి, జనవరి చివరి వారంలో తిరిగి వెళ్లి పోతాయ్.
