హైదరాబాద్, వెలుగు: సిద్స్ ఫార్మ్ తమ కొత్త సాల్టెడ్ బటర్ ప్రొడక్టులను హైదరాబాద్, బెంగళూరు మార్కెట్లకు పరిచయం చేసింది. ఇందులో ఆవు, గేదె వెన్న ఉన్నాయి. వీటిలో యాంటీబయాటిక్స్, ప్రిజర్వేటివ్స్, హార్మోన్లు లేవని తెలిపింది. ఇది100గ్రాముల బాక్స్‌లలో వస్తుందని సిద్స్ ఫార్మ్ వ్యవస్థాపకుడు డాక్టర్ కిషోర్ ఇందుకూరి చెప్పారు. ధరను రూ.100గా నిర్ణయించామని తెలిపారు.
