
బెంగళూరు: ‘‘క్యాష్ ఫర్ ట్రాన్స్‌ఫర్”కుంభకోణంలో తాను డబ్బులు తీసుకున్నట్లే నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని కర్నాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి తనపై, తన కుమారుడు యతీంద్రపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆదివారం మీడియా సమావేశంలో మండిపడ్డారు.
‘‘ఏ ఒక్క ప్రభుత్వ అధికారి బదిలీలోనైనా డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి పర్మినెంట్‌గా తప్పుకుంటా. కుమారస్వామి సీఎంగా ఉన్న టైమ్‌లోనే అధికారుల బదిలీలకు డబ్బులు తీసుకున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఆయన ఎన్ని వందల ట్వీట్లయినా చేసుకోనివ్వండి. వాటికి రిప్లయ్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు”అని సిద్ధరామయ్య చెప్పారు.