
హీరో సిద్దార్థ్(Siddarth).. చాకోలెట్ బాయ్ గా తెలుగు. తమిళ ఇండస్ట్రీ మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే కెరీర్ ప్రారంభంలో వరుస హిట్స్ అందుకున్న ఈ హీరో కొన్ని రోజులుగా సరైన హిట్టు లేక రేస్ లో వెనుకబడిపోయాడు. రీసెంట్ గా సిద్దార్థ్ నుండి వచ్చిన టక్కర్(Takkar) సినిమా కూడా ఆయనకు హిట్టు ఇవ్వలేకపోయింది. ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు సిద్దార్థ్. కానీ ఈ సినిమా కూడా ఆయన ఆశల నెరవేర్చలేకపోయింది.
తాజాగా ఈ హీరో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యాడు. ఈ హీరో ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ చిత్తా. రెడ్ జెయింట్ మూవీస్ (Red Giant Movies), ఈటాకీ (Eataki entertainments) ఎంటర్‌టైనమెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అరుణ్ కుమార్ (Arun Kumar) దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.
Bringing to you #Siddharth’s #Chithha, in cinemas on Sep 28th.
— Red Giant Movies (@RedGiantMovies_) August 20, 2023
A #RedGiantMovies release. #ChithhaFromSep28@Etaki_official #SUArunkumar @dhibuofficial @composer_vishal @RedGiantMovies_ @balaji_dop137 @iameditorsuresh#CSBalachandar @anilandbhanu @hariprasad4091… pic.twitter.com/rUK4Yc15Tn
ఈ సినిమాను సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. దీంతోపాటు చిత్తా మూవీ నుండి సిద్ధార్థ్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్లో సిద్దార్థ్ పల్లెటూరి గెటప్ లో ఆకట్టుకుంటున్నాడు. ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని కూడా పెంచేసింది.
ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. సెప్టెంబర్ 28న ప్రభాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ సలార్ రిలీజ్ కానుంది. దీంతో పెద్ద పెద్ద సినిమాలు సైతం సలార్ కు పోటీగా రావడానికి భయపడుతుంటే.. సిద్దార్థ్ మాత్రం తన చిత్తా సినిమా కోసం సలార్ ను సైతం లెక్కచేయడం లేదు. మరి సలార్ కు పోటీగా వస్తున్న సిద్దార్థ్ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకంటుందో చూడాలి.