హీరో సిద్ధార్థ్ ( Siddharth) లేటెస్ట్ మూవీ చిన్నా. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ (సెప్టెంబర్ 28న) రిలీజ్ అయ్యి..పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకి ఆడియన్స్ లో మంచి పాజిటివ్ బజ్ రావడంతో ప్రెస్ మీట్ నిర్వహించగా..నిరసనకారులు తనను మాట్లాడకుండా అడ్డుకోవడంపై సిద్ధార్థ్ స్పందించారు.
హీరో సిద్దార్ద్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో స్పందిస్తూ..తనకు జరిగిన నష్టాన్ని వివరించాడు..'నిన్న బెంగళూరులో జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. వారు అలా అడ్డుకోవడంపై తీవ్ర నిరాశ చెందాను. కర్ణాటక, తమిళనాడు మధ్య జరుగుతున్న కావేరి జల వివాదానికి(Cauvery Water Dispute)..నా సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. నేను నిర్మాతగా చిన్నా (చిత్తా) (Chithha) సినిమాను థియేటర్లలో రిలీజ్కు ముందే చాలా మందికి చూపించాను. చెన్నై, కొచ్చిలో మీడియాకు.. కొంతమంది ప్రముఖులకు చూపించాను. అంతేకాకుండా రిలీజ్కు ముందే దాదాపు 2,000 మంది స్టూడెంట్స్ కు చిత్తా మూవీ చూపించాలని ప్లాన్ చేశాను.
ఇప్పటి వరకు ఏ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా ఇటువంటి ప్లాన్ చేయలేదు. ఆ రోజు రాత్రి కన్నడ స్టార్స్ కోసం సినిమాను చూపించడానికి స్పెషల్ షోస్ ప్లాన్ చేశాం. బంద్ కారణంగా మేము అన్ని షోలను రద్దు చేశాము. దీంతో మాకు భారీ నష్టం జరిగింది. కానీ, అంతకు మించిన బాధకరమైన విషయమేంటంటే..అక్కడ ఉన్న వ్యక్తులతో మా మంచి చిత్రాన్ని పంచుకోలేకపోవడం నన్నెంతో నిరాశపరిచింది..నా డబ్బు ఖర్చుపెట్టి నేను చేసే మూవీస్ లో నా సామాజిక బాధ్యత కనిపిస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను' అంటూ ఎమోషనల్ అయ్యాడు.
మరోవైపు సిద్ధార్ద్ సినిమా విషయంలో జరిగిన సంఘటనపై.. కర్ణాటక ప్రజల తరుపున సినీ నటుడు ప్రకాష్ రాజ్, హీరో శివరాజ్ కుమార్ లు ట్విట్టర్ లో తమ అభిప్రాయాన్ని తెలిపి క్షమాపణలు చెప్పారు.
సిద్ధార్ధ్ కొంతకాలంగా తెలుగు సినిమాలకి దూరం అయినప్పటికీ..ఆడియన్స్ లో క్రేజ్ మాత్రం తగ్గలేదు.రీసెంట్ గా మహా సముద్రం, టక్కర్ మూవీస్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మూవీస్ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా ఆడాయి. కోలీవుడ్ తోపాటు తెలుగులో మార్కెట్ సంపాదించుకున్న సిద్దార్థ్.