
సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తెలుసు కదా’. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా టీమ్ అంతా లొకేషన్‌లో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మరోవైపు ప్రమోషన్స్ స్టార్ట్ చేసి మేకర్స్.. ఇప్పటికే ఫస్ట్ సాంగ్, టీజర్‌ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే సెకండ్ సాంగ్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 17న తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సినిమా విడుదల కానుంది. నవీన్ నూలి ఎడిటర్‌గా, జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.