ఓటర్లను ప్రలోభాలకు గురిచేయొద్దు : సీఐ విద్యాసాగర్

ఓటర్లను ప్రలోభాలకు గురిచేయొద్దు :  సీఐ విద్యాసాగర్
  •     సీఐ విద్యాసాగర్

సిద్దిపేట రూరల్, వెలుగు: ఓటర్లను ప్రలోభాలకు గురిచేయొద్దని సీఐ విద్యాసాగర్​సూచించారు. ఆదివారం సిద్దిపేటలో అర్బన్ మండలంలో సర్పంచ్, వార్డు అభ్యర్థులకు అవగాహన సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా తహసీల్దార్​రవి కిరణ్, ఎంపీడీవో మార్టిన్ లూధర్ తో కలసి మాట్లాడుతూ.. ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి అధికారులు, అభ్యర్థుల మధ్య పూర్తి సహకారం ఉండాలని కోరారు. ఎన్నికల సమయంలో ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే తక్షణమే పోలీస్‌ లేదా ఎన్నికల అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.