సర్వేయర్ల శిక్షణకు ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ మనుచౌదరి

సర్వేయర్ల శిక్షణకు ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ మనుచౌదరి

సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కాన్ఫరెన్స్ హాల్ లో లైసెన్స్ డ్ సర్వేయర్ల శిక్షణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ మనుచౌదరి ల్యాండ్ సర్వే ఏడీ వినయ్ కుమార్ ను ఆదేశించారు. శనివారం అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి కాలేజ్ సెమినార్ హాల్ ను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సర్వేయర్ల శిక్షణ కోసం 352 మంది దరఖాస్తు చేసుకోగా మొదటి విడతలో 176 మందిని ఎంపిక చేశామని,  వారికి ఈ నెల 26 నుంచి జులై 26 వరకు 50 రోజులు శిక్షణ ఇస్తామని తెలిపారు. శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్, జిరాక్స్ కాపీలతో శిక్షణకు హాజరుకావాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో అబ్దుల్ రెహమాన్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ సునీత, తహసీల్దార్​సలీంమియా పాల్గొన్నారు.

జీపీవో ఎగ్జామ్ పకడ్బందీగా నిర్వహించాలి 

నేడు డిగ్రీ కాలేజీలో నిర్వహించే గ్రామ పాలన అధికారుల పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. అనంతరం పరీక్ష నిర్వహించే గదులను పరిశీలించారు. అభ్యర్థులకు తాగునీరు అందుబాటులో ఉంచాలని, ఎలాంటి అవాంఛనీయ  ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట డీఆర్డీవో జయదేవ్ ఆర్య, అసోసియేట్ ప్రొఫెసర్ అయోధ్య రెడ్డి ఉన్నారు.