ఆఫీసర్ల నిర్లక్ష్యంపై కలెక్టర్​ ఆగ్రహం​: ప్రశాంత్​ జీవన్​ పాటిల్

ఆఫీసర్ల నిర్లక్ష్యంపై కలెక్టర్​ ఆగ్రహం​:  ప్రశాంత్​ జీవన్​ పాటిల్

హుస్నాబాద్​, వెలుగు :  హుస్నాబాద్​లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్​ ఆఫీస్​ కాంప్లెక్స్​(ఐవోసీ) బిల్డింగ్​ పనులు దాదాపు పూర్తయ్యాయని, ఆఫీసులను అందులోకి షిఫ్ట్​ చేయాలని సిద్దిపేట కలెక్టర్​ ప్రశాంత్​ జీవన్​ పాటిల్​ ఆఫీసర్లను ఆదేశించారు. అన్ని పనులు పూర్తయినా ఆఫీసుకు కీలకమైన మిషన్​ భగీరథ నీటి కనెక్షన్​ పనులు కాకపోవడంతో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఐవోసీ బిల్డింగ్​ను పరిశీలించి మాట్లాడారు.

 త్వరలోనే కాంప్లెక్స్​ను ఓపెన్​ చేసి సేవలు అందించనుండడంతో జిల్లా అధికారులు డివిజన్​ ఆఫీసులను అందులోకి షిఫ్ట్​ చేయాలన్నారు. కాంప్లెక్సులోని అన్ని ఆఫీసులకు ఫర్నిచర్​ను అందజేస్తామన్నారు. పనుల్లో స్పీడ్​ పెంచాలన్నారు. నిర్మాణ దశలో ఉన్న సెకండ్​ ఫ్లోర్​ అడ్మిషన్స్ శాంక్షన్స్ పూర్తి చేసుకొని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. కలెక్టర్ వెంట హుస్నాబాద్​ ఆర్డీవో బెన్​ శాలోం, డీఎస్​వో శ్రీనివాస్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ మూర్తి, డీటీవో బాలరాజు, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్, డీపీవో  దేవకీదేవి, డీఏవో తదితరులున్నారు.