సమస్యల పరిష్కారం కోసం ..పోలీస్ కమిషనర్ తో ఫోన్-ఇన్

సమస్యల పరిష్కారం కోసం ..పోలీస్ కమిషనర్ తో ఫోన్-ఇన్

సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు, స్వీకరించి వాటిని పరిష్కరించే లక్ష్యంతో  " పోలీస్ కమిషనర్ తో ఫోన్- ఇన్" కార్యక్రమం ప్రతీ శనివారం నిర్వహిస్తున్నట్లు సీపీ విజయ్ కుమార్ తెలిపారు. ప్రజా సమస్యల అంశాల గురించి నేరుగా తనతో మాట్లాడవచ్చన్నారు. 

శనివారం ఉదయం 11గంటల నుంచి 12 వరకు 8712667100, 8712667306, 8712667371 నంబర్లకు ఫోన్ చేసి మాట్లాడవచ్చన్నారు. ప్రజలు, పోలీసుల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు. పౌరులు నిర్భయంగా తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.