షూస్​, షాంపూ బాటిళ్లలో రూ.20 కోట్ల విలువైన కొకైన్​

షూస్​, షాంపూ బాటిళ్లలో రూ.20 కోట్ల విలువైన కొకైన్​
  •     ముంబై ఎయిర్​పోర్టులో సియెర్రా లియోన్ దేశానికి చెందిన మహిళ నుంచి స్వాధీనం

ముంబై :  ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్ట్​లో సుమారు రూ.20 కోట్ల విలువైన కొకైన్​ను అధికారులు పట్టుకున్నారు. అలాగే ఆ డ్రగ్​ను అక్రమంగా రవాణా చేస్తున్న సియెర్రా లీయోన్​ దేశానికి చెందిన మహిళను అరెస్ట్​ చేశారు. ఆదివారం కెన్యా రాజధాని నైరోబి నుంచి ఆ మహిళ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్ట్​లో ల్యాండ్​ అయింది. అయితే, ఆమెపై అనుమానం రావడంతో డైరెక్టరేట్​ఆఫ్​రెవెన్యూ ఇంటెలిజెన్స్​(డీఆర్ఐ) అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం ఆమె వద్ద ఉన్న వస్తువులను తనిఖీ చేశారు. ఆమె వద్ద ఉన్న షూస్, మాయిశ్చరైజర్ బాటిల్, షాంపూ బాటిళ్లు అధిక బరువు ఉండడంతో అధికారులకు వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అందులో మోతాదుకు మించిన పౌడర్​లభించింది. దానిని పరీక్షించగా అది కొకైన్​అని తేలినట్టు అధికారులు తెలిపారు. రూ.19.79 కోట్ల విలువైన 1,979 గ్రాముల కొకైన్ ను​స్వాధీనం చేసుకొని, ఆమెను అరెస్ట్​చేసి సోమవారం జ్యుషీడియల్​ కస్టడీకి తరలించారు. డ్రగ్స్​అక్రమ రవాణాకు సంబంధించిన నెట్​వర్క్​గురించి తదుపరి విచారణ చేయనున్నట్టు డీఆర్ఐ అధికారులు తెలిపారు.