
- ఎస్ఐఈటీ డైరెక్టర్ విజయలక్ష్మి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపుదలకు టీచర్లు కృషి చేయాలని ఎస్ఐఈటీ డైరెక్టర్ విజయలక్ష్మి బాయి సూచించారు. గురువారం జిల్లాలో ఆమె పర్యటించి కొత్తగూడెంలోని మండల వనరుల కేంద్రంలో ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. యూడైస్ ప్లస్, అపార్ జనరేషన్, స్టూడెంట్స్, టీచర్స్ ఎఫ్ఆర్ఎస్, యూనిఫాం పంపిణీ లాంటి విషయాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత టీచర్లపైనే ఉందన్నారు. గవర్నమెంట్ స్కూళ్లను బలోపేతం చేయడంలో టీచర్ల కృషి కీలకమని చెప్పారు. ఈ ప్రోగ్రాంలో డీఈవో నాగలక్ష్మి, విద్యాశాఖ కో ఆర్డినేటర్లు నాగరాజశేఖర్, జె.అన్నమణి, ఎస్కె. సైదులు, ఎన్. సతీశ్‌కుమార్ పాల్గొన్నారు.