మార్గశిర పౌర్ణమి ( డిసెంబర్ 4) : ఇలా చేయండి.. లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది..

మార్గశిర పౌర్ణమి ( డిసెంబర్ 4) :  ఇలా చేయండి.. లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది..



 మార్గశిర మాసం అనేక పర్వదినాల సమాహారం. విష్ణువుకు ఎంతో ఇష్టమైన  మార్గశిరమాసం కొనసాగుతుంది.  మార్గశిర మాసంలో పౌర్ణమి తిథిరోజున కొన్ని పనులు చేస్తే అంతా శుభమే జరుగుతుందని  పండితులు చెబుతున్నారు.  మరి ఏడాది అలాంటి పవిత్రమైన రోజు ఎప్పుడు వచ్చింది.. ఎలాంటి పూజలు చేయాలి.. దానివలన కలిగే ఫలితాలేమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. 

మార్గశిర మాసం కేవలం పండుగలు మాత్రమే కాదు, ఈ మాసం వ్రతాలకు కూడా నిలయమే. అద్భుత వ్రతంగా పేరు పొందిన మార్గశిర గురువారం లక్ష్మీవ్రతం, హనుమద్వ్రతం వంటి వ్రతాలనూ ఈ మాసంలో ఆచరిస్తారు.

హిందూ పంచాంగం ప్రకారం.. మార్గశిర పౌర్ణమి తిథి 2025 డిసెంబర్ 4వ తేదీన గురువారం ఉదయం 8.37 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే డిసెంబర్ 5వ తేదీ శుక్రవారం రోజు తెల్లవారుజామున 4.43 గంటలకు పౌర్ణమి తిథి ముగుస్తుంది. కాబట్టి డిసెంబర్ 4వ తేదీన మార్గశిర పౌర్ణమి  జరుపుకుంటారు.  4 వ తేది రోజు ఉదయం 06.59 గంటల నుంచి మధ్యాహ్నం 02.54 గంటల వరకు రవియోగం ఉంటుంది. ఈ రవి యోగంలో పవిత్ర స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు

ALSO READ : శని దోషం అంటే ఏమిటి..

 ఎలా పూజ చేయాలి

  • బ్రహ్మ ముహూర్తానికి  నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి.  ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర నీరు చల్లండి.
  • పూజ స్థలంలో పీటను ఏర్పాటు చేసి.. కొత్త వస్త్రాన్ని ఉంచి దానిపై కొద్దిగి బియ్యం పోసి మధ్యలో  కలశాన్ని ఏర్పాటు చేయండి.  దానికి ఎర్రటి వస్త్రాన్ని చుట్టండి. 
  • లక్ష్మీనారాయణుల విగ్రహాన్ని కాని ... చిత్రపటాన్ని  కాని ప్రతిష్టించి పూలతో అలంకారం చేయండి. 
  • దీపారాధన చేయండి. 
  • లక్ష్మీనారాయణులను ఆహ్వానించండి.  కలశం దగ్గర పసుపుతో దేవత పాదముద్రలు వేయండి.  
  •  విష్ణుసహస్రనామం చదవండి.. లక్ష్మీదేవిని పూజించండి.  
  • పసుపు పూలతో పూజించండి. పసుపు, కుంకుమ, గంధం సమర్పించండి.
  • పాయసాన్ని.. కేసరి .. పసుపు రంగు స్వీట్లను నైవేద్యంగా సమర్పించండి.
  • అగర్​ బత్తీలు వెలిగించి ధూపం సమర్పించండి.

శివుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల ఇంటిలో శాంతి, శ్రేయస్సు నెలకొంటాయి. సాయంత్రం శని ఆలయాన్ని సందర్శించి, శని దేవుడికి తెలుపు రంగులో ఉండే ఏదేని స్వీటును నైవేద్యంగా సమర్పించాలి. శివుడు, శనిదేవులను పూజించే సమయంలో ఓం నమఃశివాయ, ఓం శనేశ్చరాయ నమః మంత్రాలు జపించడం వల్ల, వృత్తి వ్యాపారాల్లో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి.ఇలా  చేయడం వలన  గత జన్మ పాపాలను, కర్మ అడ్డంకులను తొలగిపోయి... మానసిక స్పష్టత, కుటుంబ సామరస్యం,  భౌతిక శ్రేయస్సునుకలుగుతుంది. ఆధ్యాత్మిక వృద్ధిని పెంచుతుంది. లక్ష్మి, విష్ణువు ఇద్దరి ఆశీర్వాదాలు కలుగుతాయని పద్మపురాణం ద్వారా తెలుస్తుంది. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.