
హిందూ పురాణాల ప్రకారం ప్రతి ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. ఏడాదిలో 24 ఏకాదశి తిథులు వస్తాయి. ప్రతి ఏకాదశికి ఒక్కోపేరు పెట్టారు రుషిపుంగవులు. వైశాఖ మాసం బహుళ పక్షంలో (అమావాస్యకు ముందు) వచ్చే ఏకాదశిని అపర ఏకాదశి ( మే 23) అంటారు. ఈ ఏకాదశికి అనేక పేర్లు ఉన్నాయి . జలకృత ఏకాదశి, అజల ఏకాదశి, భద్రకళి ఏకాదశి అని వివిధ పేర్లతో పిలుస్తారు. మరి ఈ నేపథ్యంలో అపర ఏకాదశి అంటే ఏంటి, అసలు దీని ప్రాముఖ్యత ఏంటి, ఎలాంటి పూజలు చేయాలి లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అపర ఏకాదశి ముహూర్తం:
- ఏకాదశి తిథి ప్రారంభం... మే 23 తెల్లవారు జామున 01.12 లకు ప్రారంభం
- ఏకాదశి తిథి సమాప్తం... . మే 23 ఉదయం 10.29 లకు ముగుస్తుంది.
- అపర ఏకాదశి శుభ ముహూర్తం....మే 23 ఉదయం 05.30 నుంచి 08.16 వరకు
- ఉపవాస దీక్ష పాటించే రోజు: మే 23 న ఉపవాసం ఉండి మే 24 న విరమించాలి.
పూజా విధానం
అపర ఏకాదశి రోజు విష్ణుమూర్తిని... లక్ష్మీదేవిని పూజించాలి. దేవుడి మందిరంలో విష్ణుమూర్తి.. లక్ష్మీదేవి విగ్రహం ప్రతిష్టించుకోవాలి. గంగా వాటర్ తో అభిషేకం చేయాలి. ఆవునెయ్యితో గాని.. నువ్వుల నూనెతో గాని దీపారాధన చేసి విష్ణు సహస్రనామం చదవాలి... లేదా వినాలి. స్వామి వారికి పాయసం నైవేద్యంగా సమర్పించి మరునాడు తినాలి. పూజలు చేసిన అనంతరం ప్రజలకు ప్రసాదం పంపిణీ చేయాలి. స్వామి వారిని పూజించేటప్పుడు తులసి దళాలతో కచ్చితంగా ఉండాలి. ఈ ఉపవాసాన్ని మనం పాటిస్తే, మన దుంఖం, బాధ, అవినీతి లాంటి చెడుగుణాలు దూరమవుతాయని భక్తులు ఎంతగానో నమ్ముతారు.
శ్రీ హరి ముందు దీపం వెలిగించండి: అపరా ఏకాదశి నాడు నారాయణుడి ముందు నెయ్యి దీపం వెలిగించండి. దీని వల్ల మనస్సులోని కోరికలు నెరవేరుతాయి. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. కాబట్టి ఆ రోజున ( మే 23) శ్రీ హరి ముందు దీపం వెలిగించడం చాలా ముఖ్యమని పండితులు అంటున్నారు. అపర ఏకాదశి నాడు దీపాలు వెలిగించడం వల్ల జీవితంలో సుఖం, శాంతి, సమృద్ధి కలుగుతాయి. దీని వల్ల ఇంటిలోని ప్రతికూల శక్తి తొలగిపోతుందిఅలి చేస్తే లక్ష్మీ నారాయణుల అనుగ్రహం.. ఉంటుందని పండితులు అంటున్నారు.
నీటి దానం : అపర ఏకాదశి రోజున నీటిని దానం చేయడం వల్ల చాలా పుణ్యం వస్తుంది. ఆ రోజున ( మే 23) నీటి కుండను దానం చేయండి.
పేదలకు అన్నదానం: అపర ఏకాదశి రోజున పేదలకు ఆహారాన్ని దానం చేయండి. మీ సామర్థ్యం ప్రకారం బియ్యం, గోధుమలు, పప్పులు లేదా ఇతర ధాన్యాలను దానం చేయవచ్చు. ఏకాదశి రోజున ఆహారాన్ని దానం చేయడం ద్వారా ఇంట్లో ఎప్పుడూ ఆహార కొరత ఉండదని పురాణాలు చెబుతున్నాయి.
పండ్లు, బెల్లం: అపర ఏకాదశి రోజున పండ్లు, బెల్లం దానం చేయడం కూడా చాలా మంచిది. ఏకాదశి రోజున ఏదైనా కాలానుగుణ ఫలాలను దానం చేయవచ్చు. పండ్లను దానం చేయడం ద్వారా కుటుంబంలో ప్రేమ, ఆనందం కలిగి ఉంటారు.
దక్షిణ తాంబూలం: దగ్గరలోని దేవాలయాలని వెళ్లి స్వామిని పూజించి.. శక్తి మేరకు బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం ఇవ్వండి.. పేదలకు డబ్బు దానం చేయండి. ఇలా చేసిన వారికి లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలిగి.. ఎప్పటికి సంపదకు.. ఆహారానికి కొరత ఉండదని పండితులు చెబుతున్నారు.
దుస్తులు: అపర ఏకాదశి రోజున పేదవారికి బట్టలు దానం చేయండి. ఏకాదశి రోజున వస్త్ర దానం చేయడం వల్ల వ్యక్తికి పుణ్య ఫలితాలు లభిస్తాయి