
దేశ వ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఊరూ, వాడా దుర్గామాతను పూజించారు. భక్తులు నియమ నిష్ఠలతో బతుకమ్మను.. దుర్గమ్మ అమ్మవారిని పూజిస్తున్నారు. ఇలా చేయడం వల్ల దుర్గాదేవి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం తమపై ఉంటుందని భక్తులు విశ్వసిస్తుంటారు. దుర్గాష్టమి రోజు ఏ దేవతను పూజించాలి.. ఆ అమ్మవారి విశిష్టత ఏమిటి.. ఎందుకు పూజించాలో ఈ స్టోరీలో తెలసుకుందాం. . . !
హిందువులు నవరాత్రి తొమ్మిది రోజులు చాలా పవిత్రంగా భావిస్తారు. ఆశ్వయుజ మాసం శుక్ష పక్షంలో అష్టమి తిథి రోజున దుర్గాష్టమి ( మహాష్టమి) పండుగను వైభవంగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం ఆ రోజున మహాగౌరి అమ్మవారు చండ .... ముండ అనే రాక్షసుల నాశనం చేసింది.
నవరాత్రి ఉత్సవాల్లో దుర్గాదేవిని తొమ్మిది రూపాల్లో విశేషంగా పూజలు చేస్తారు.ఈ సంవత్సరం ( 2025) దసరా (శారదీయ) నవరాత్రి సెప్టెంబర్ 22 వతేదీన ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 30 వతేదీన దుర్గాష్టమి పండుగను జరుపుకుకుంటున్నాయి. అష్టమి తిథిసెప్టెంబర్ 30 వ తేది (ఎనిమిదవ రోజు) చాలా విశేషమని పురాణాల్లో పేర్కొన్నారు.
మహాగౌరి అమ్మవారిని ఎలా పూజించాలంటే..!
- సెప్టెంబర్ 30 వ తేది ( మంగళవారం) తెల్లవారుజామున స్నానం చేసిన తర్వాత, దుర్గాదేవి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఒక పీఠంపై ఉంచండి.
- అమ్మవారికి పై గంగా నీళ్లు చల్లండి. లేకపోతే దగ్గరలోని నదుల నీరు.. అదీ లేక పోతే ఆ నీటిలో పసుపు వేసి స్నానం చేయించిన విధంగా తమలపాకుతో గాని.. మామిడాకుతో గాని అభిషేకం చేయండి.
- బియ్యం, కుంకుమ, పువ్వులు, దుస్తులు, నగలు, పండ్లు , స్వీట్లు సమర్పించండి.
- దుర్గాదేవిని ఆవాహన చేసి పూజ చేయండి.
- దుర్గాష్టమి ( సెప్టెంబర్ 30) బాల పూజ చేస్తారు. బాలికలను ( రజస్వల కాని బాలికలు) మహాగౌరి అమ్మవారి స్వరూపంగా భావించి పూజించాలి. ఈ రోజున అమ్మవారికి గారెలు.. పాయసం నైవూద్యంగా సమర్పించాలి.
దుర్గాష్టమి ( సెప్టెంబర్ 30) వ తేది అమ్మవారి పూజించడం వలన బాధలు .. భయాల నుంచి ఉపశమనం లభిస్తుంది. అమ్మవారి దీవెనలు పుష్కలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక బలాన్ని ప్రసాదించే దేవతగా అన్నపూర్ణదేవిగా కొలుస్తారు. దుర్గాదేవి అష్టోత్తరాన్ని చదువి.. ధూపం.. దీపం.. నైవేద్యం హారతి సమర్పించాలి.
గౌరీదేవి ఆవిర్భావం.. విశిష్టత
పార్వతి దేవి శివుడిని భర్తగా పొందేందుకు కఠోర తపస్సు చేసింది. ఈ సమయంలో పార్వతి అమ్మవారు వేర్లు.. పండ్లు .. ఆకులు మాత్రమే తిన్నారని స్కంధ పురాణం ద్వారా తెలుస్తుంది. ఈ తపస్సు అమ్మవారికి ఎంతో గౌరవంతో పాటు తన కోరిక సఫలం అయింది. మహా తపస్సు ద్వారా అమ్మవారు గొప్ప గౌరవాన్ని సాధించినందుకు .. ఆమెకు మహాగౌరి అని పేరు పెట్టారు. భర్త కోసం తపస్సు చేసి గౌరీదేవిగా అవతరించింది కాబట్టి .. హిందూ వివాహ సమయంలో పెళ్లి కూతురితో గౌరీ పూజను చేయిస్తారు.
అమ్మవారు తపస్సుకు సంతోషించిన పరమేశ్వరుడు ప్రత్యక్షమయి.. ఆమెను గంగలో స్నానం చేయమని అడిగారు. తల్లి పార్వతి గంగలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు, కఠినమైన తపస్సు కారణంగా, ఆమె రూపం నల్లటి రంగుతో కనిపించింది. ఈ రూపాన్ని కౌశికి అంటారు. స్నానం తర్వాత, ఆమె రూపం ప్రకాశవంతమైన చంద్రుడిలా కనిపించింది, అందుకే ఈ తల్లి రూపాన్ని మహాగౌరి అని పిలుస్తారు.