శ్రీకృష్ణుడు గోవర్దన పర్వతాన్ని ఎప్పుడు ఎత్తాడు.. ఆరోజు ఏంచేయాలి..

శ్రీకృష్ణుడు గోవర్దన పర్వతాన్ని ఎప్పుడు ఎత్తాడు.. ఆరోజు ఏంచేయాలి..

గోవర్ధన పూజను కన్నయ్య భక్తులు ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా, వైభవంగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం .. కార్తీకమాసం మొదటి రోజున శ్రీకృష్ణుడు గోవర్దన గిరిని ఎత్తాడని పండితులు చెబుతున్నారు. దీనిని అన్నకుట్ పూజ అని కూడా పిలుస్తారు. 


ఇంద్రుడి కోపం నుంచి గోవులను, బృందావనవాసులను గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుపై ఎత్తిన శ్రీకృష్ణుడి   కార్తీకమాసం శుక్ల పాడ్యమి రోజు ఎత్తాడని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాడి కార్తీకమాసం  శుక్ల పాడ్యమి అక్టోబర్​ 22న వచ్చింది.  ఈ రోజున గోవర్ధన పర్వతాన్ని, శ్రీకృష్ణుడిని పూజిస్తారు

 శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుపై ఎత్తి పట్టుకున్నాడని.. ఆ సందర్భానికి గుర్తుగా భక్తులు ప్రేమతో పండగ జరుపుకుంటారు. అన్నకూట్ ప్రసాదాన్ని కృష్ణయ్యకు సమర్పిస్తారు. ఆనందం , శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. 

 ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శుక్ల పక్ష ప్రతిపాద తిథి నాడు గోవర్ధన పూజ జరుపుకుంటారు. ఈ ఏడాది కార్తీక శుక్ల పాడ్యమి తిథి అక్టోబర్ 21..  2025 సాయంత్రం ప్రారంభమవుతుంది. అయితే ఉదయ ప్రతిపాద తిథి అక్టోబర్ 22న కనుక గోవర్ధన పూజ 2025 అక్టోబర్ 22 బుధవారం జరుపుకుంటారు.

గోవర్ధన్ పూజ శుభ సమయం ఏడాది పొడవునా ఆనందం, శాంతి, శ్రేయస్సు , మంచి ఆరోగ్యాన్ని కోరుకునేందుకు గోవర్ధన పూజ నిర్వహిస్తారు. శ్రీకృష్ణుడిని, గోవర్ధన పర్వతాన్ని పూజించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి , ఆనందం నెలకొంటాయి.

పూజకు కావలసిన సామాగ్రి

గోవర్ధన కు కావాల్సిన పూజా సామాగ్రి పూజ కోసం పసుపు, కుంకుమ, అక్షతలు, స్వీట్లు, నైవేద్యం, ఖీర్, నువ్వుల నూనె దీపం, పువ్వులు, పెరుగు, తేనె, అగరబత్తి, కలశం, పూలమాల, శ్రీకృష్ణుని విగ్రహం లేదా చిత్రం, ఆవు పేడ, గోవర్ధన పర్వతం ఫోటో, గంగా జలం, తమలపాకు , గోవర్ధన పూజ కథకు సంబంధించిన పుస్తకం.

గోవర్ధన పూజా విధానం 

  • ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి పూజా స్థలాన్ని శుభ్రం చేయాలి. ప్రాంగణంలో లేదా ప్రార్థనా స్థలంలో ఆవు పేడను ఉపయోగించి గోవర్ధన పర్వత ఆకారాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
  • గోవర్దన పర్వతానికి పసుపు, అక్షతలను సమర్పించండి.
  •  దీపం వెలిగించి శ్రీకృష్ణుడికి ఖీర్, పూరీ, స్వీట్లు, పాలు, నీరు, కుంకుమ పువ్వును నైవేద్యంగా సమర్పించండి.  కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి గోవర్ధనుడిని ఏడుసార్లు ప్రదక్షిణ చేయండి. 
  •  హారతి ఇచ్చి పూజలో తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే క్షమించమని కోరండి. 

గోవర్ధనుడిని పూజించడం వల్ల ఆనందం , శ్రేయస్సు లభిస్తుందని, ఇంట్లో సానుకూల శక్తి కొనసాగుతుందని , శ్రీకృష్ణుని ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు. ప్రకృతి, ఆవులు, జంతువులు మన జీవితానికి, శ్రేయస్సుకు ఆధారం కనుక వాటి ప్రాముఖ్యతను గౌరవించడానికి గోవర్ధన్ పూజ జరుపుకుంటారు.  ఆవును పవిత్రంగా భావిస్తారు. అందుకే గోవర్ధన పర్వతం ఆవు పేడతో తయారు చేసి పూజిస్తారు. తద్వారా ప్రకృతి , గోమాత ఆశీర్వాదాలు పొందుతారు..

Disclaimer:పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించేదు.