
హిందూమతంలో ప్రదోష వ్రతాన్ని నెలకు రెండు సార్లు జరుపుకుంటారు. వైశాఖ మాసంలో ప్రదోష వ్రతం శనివారం మే 24 వ తేదీన వచ్చింది.. శనివారం ప్రదోష వ్రతం రావడం వల్ల దీన్ని శని ప్రదోష వ్రతం గా పిలుస్తారు.
శని ప్రదోషం రోజున శివుడుతో పాటు శని దేవుడిని పూజించడం వల్ల శని అశుభ ప్రభావాల నుంచి విముక్తి లభిస్తుంది. జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. ఆరోజు ( మే 24) చేసే కొన్ని పనుల వల్ల పరమేశ్వరుడు తన భక్తుల అన్ని కోరికలను నెరవేరుస్తాడు. వారికి సంతోషం, అదృష్టాన్ని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం. ఈ రోజున శివుడితో పాటు శనీశ్వరుడిని పూజించడం వల్ల శని మహాదశ, అర్ధాష్టమ శని, ఏలినాటి శని సహా సకల బాధలు తొలగిపోతాయి.
శని ప్రదోష వ్రత ముహూర్తం
- త్రయోదశి తిథి ప్రారంభం : మే 24, 2025 రాత్రి 07:20 గంటలకు
- త్రయోదశి తిథి ముగింపు: మే 25, 2025 మధ్యాహ్నం 03:51 గంటలకు
- ప్రదోష కాలము పూజ చేయాల్సని ముహూర్తం: మే 24 రాత్రి 07:10 నుండి 09:13 వరకు
శని ప్రదోష పూజా విధానం..
- శని ప్రదోష వ్రతం రోజున ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించాలి.
- దేవుడు గదిని శుభ్రం చేసి శివుడికి సంబంధించిన లింగాష్టకం.. పఠించాలి.
- పూజ గదిలో నెయ్యి దీపం వెలిగించండి.
- శివ-పార్వతుల విగ్రహం ముందు పండ్లు, పూలు, ధూపం,దీపం, నైవేద్యాలు సమర్పించండి.
- శివుడితో సహా సకల దేవతలకు హారతి ఇవ్వండి.
- సాయంత్రం ప్రదోష ముహూర్తంలో పూజకు సిద్ధం చేయండి.
సాయంత్రం ప్రదోష పూజ
వీలైతే సాయంత్రం మళ్లీ స్నానం చేసి శివలింగంపై నీటిని సమర్పించండి. శివుడికి బిల్వపత్రాలను సమర్పించండి. శని ప్రదోష రోజున శివలింగానికి 108 బిల్వ పాత్రలను సమర్పించండి. ఆ రోజున మినప్పప్పు, నల్ల బూట్లు, దుస్తులు వంటివి దానం చేస్తే చాలామంచిదని పండితులు చెబుతున్నారు. శని ప్రదోష వ్రతం రోజున, సాయంత్రం శివయ్యను జలంతొ ( నీటితో) అభిషేకం చేయండి. శని భగవానుడికి నల్ల నువ్వులు , బెల్లం సమర్పించండి.
‘ఓం నమః శివాయ’ అనే మంత్రాన్ని పఠించండి. శివునికి హారతి ఇవ్వండి. పూజ ముగిసిన తర్వాత క్షమించమని అడగండి. ఆ తర్వాత రావి చెట్టు దగ్గర ఆవ నూనె దీపం వెలిగించాలి. శనీశ్వరుడిని ఆరాధించండి. శనీశ్వరుని మంత్రాలను పఠించండి.