
హిందువులు అందరూ ఏదో ఒక సమయంలో గుడికి వెళతారు. అక్కడ ఉండే ధ్వజస్థంభాన్ని తాకి మొక్కుతూ.. ప్రదక్షిణాలు చేస్తుంటారు. ఆలయాల్లో ధ్వజస్థంభములను భక్తులు తాకవచ్చా! తాకకూడదా? ఈ విషయం గురించి పురాణాల్లో ఏముంది.. ధ్వజస్థంభం ప్రాముఖ్యత ఏమిటి.. మొదలగు విషయాలను తెలుసుకుందాం. .
దక్షిణ భారత దేవాలయాలలో, భక్తులు గౌరవానికి చిహ్నంగా మరియు ఆశీర్వాదం పొందడానికి తరచుగా ధ్వజస్తంభాన్ని తాకుతూ నమస్కరిస్తారు . ధ్వజస్తంభం శక్తి వాహకమని ... ఆలయం గుండా ఆధ్యాత్మిక శక్తులు సరిగ్గా ప్రవహించేలా చూసుకోవడానికి సహాయపడుతుంది.
ధ్వజస్తంభాన్ని తాకడం ప్రాముఖ్యత:
శక్తి బదిలీ: ధ్వజస్తంభం గర్భగుడి లోపల మంత్రాల జపం నుండి శక్తిని పొందుతుంది. భగవంతుడికి ఎదురుగా ఉండే ధ్వజ స్తంభాన్ని తాకినా కాని ప్రదక్షిణ చేసిన భక్తులకు శక్తి ని బదిలీ అవుతుందని పండితులు చెబుతున్నారు.
ఆధ్యాత్మిక సంబంధం: ధ్వజస్తంభాన్ని తాకడం వల్ల భక్తులు దైవిక శక్తితో కనెక్ట్ అవ్వడానికి.. ఆశీర్వాదాలను పొందడానికి సహాయపడుతుందని పురాణాల ద్వారా తెలుస్తుంది.
సాంస్కృతిక ప్రాముఖ్యత: కొన్ని దేవాలయాలలో, ధ్వజస్తంభాన్ని పవిత్రమైన వస్తువుగా పరిగణిస్తారు. దానిని తాకడం భక్తులు గౌరవం భక్తిని చూపించడానికి ఒక మార్గం గా భావిస్తారు.
దేవాలయంలోకి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభానికి సాష్టాంగ ప్రణామం చేయాలి. ఆ తరువాత ధ్వజస్థంభం తో కలుపుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి గంటను కొడతారు. పండితులు తెలిపిన వివరాల ప్రకారం ధ్వజస్థంభం కూడా స్వామి రూపమే. దేవాలయాల్లో ఉత్సవాలు ప్రారంభించేటప్పుడు ముందుగా ధ్వజారోహణం చేస్తారు. అంటే జయపతాకను కట్టి పై దాకా ఎగురవేస్తారు. పతాకం చూడగానే దూరాన ఉన్నవారు కూడా ఉత్సవాలు ప్రారంభం అయ్యాయనే విషయాన్ని తెలుసుకుంటారు.ఉత్సవాలు అయిపోగానే పతాకాన్ని దింపుతారు. దానినే ధ్వజావనతం అంటారు. వైష్ణవాలయాల్లో ఈ జెండా మీద గరుత్మంతుని చిహ్నం, శివాలయాల్లో నందీశ్వరుని చిహ్నం, అమ్మవారి దేవాలయాల్లో సింహ చిహ్నం ఉంటాయి. కొన్ని దేవాలయాలలో రాతి ధ్వజస్తంభాలు కూడా ఉన్నాయి.
గర్భాలయాన్ని ముఖంగాను, ధ్వజస్తంభాన్ని హృదయంగాను పోలుస్తారు. ఆలయ ప్రాకారాలు చేతులవంటివి. నిత్యహారతులు జరిగే దేవాలయాలలో షోడశోపచార పూజావిధానం జరగాలంటే ధ్వజస్తంభం తప్పనిసరని పండితులు చెబుతున్నారు. దీపారాధనలు, నైవేద్యం వంటి ఉపచారాలు ధ్వజస్తంభానికి కూడా చేయాలి.
ధ్వజస్తంభాన్ని తాకడం లేదా కొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించడం గురించి ప్రతి ఆలయానికి దాని స్వంత నియమాలు మరియు నిబంధనలు ఉంటాయి. భక్తులు ఈ నియమాలను గౌరవించాలి, మరియు ఆలయ అధికారులు అందించిన మార్గదర్శకాలను పాటించాలి.