జాగ్రత్త సారూ : కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజ ఆనవాళ్లు

జాగ్రత్త సారూ : కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజ ఆనవాళ్లు

హైదరాబాద్: నందినగర్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజల ఆనవాళ్లు కలకలం సృష్టించింది. హైదరాబాద్ లోని నందినగర్ లో కేసీఆర్ నివాసం ఉంది.  ప్రస్తుతం కేసీఆర్ అక్కడే ఉంటున్నారు. ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉంది. మంగళవారం గుర్తి తెలియని వ్యక్తులు ఆ ప్రాంతంలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లను స్థానికులు గుర్తించారు. ఎర్రని బట్టలు, బొమ్మ, పసుపు కుంకుమ,వెంట్రుకలు నిమ్మకాయలు అక్కడ ఉన్నాయి. దీంతో చుట్టు పక్కలవారు భయాందోళనలకు గురవుతున్నారు. నిన్న అర్థరాత్రి సమయంలో ఈ క్షుద్ర పూజలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.