మార్పు మంచిదే: మూడు నెలల క్రితమే డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ కేసులో అరెస్ట్.. ఇపుడు డ్రగ్స్‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా మూవీ

మార్పు మంచిదే: మూడు నెలల క్రితమే డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ కేసులో అరెస్ట్.. ఇపుడు డ్రగ్స్‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా మూవీ

మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ నటుడిగా చక్కని గుర్తింపును అందుకున్నాడు షైన్ టామ్ చాకో. దసరా, దేవర లాంటి చిత్రాల్లో విలన్గా నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు చాకో. అయితే మూడు నెలల క్రితం డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ కేసులో అరెస్టవడం సంచలనం రేపింది. ఆ తర్వాత బెయిల్‌‌‌‌‌‌‌‌పై విడుదలైన చాకో.. డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ వ్యసనం నుంచి బయటపడేందుకు డీ అడిక్షన్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరాడు.

ఈ క్రమంలో ఓ రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయాడు. ఇలాంటి క్లిష్ట సమయంలో తను ఓ కొత్త సినిమాకు సైన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న అతను, డ్రగ్స్‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా తెరకెక్కిస్తున్న చిత్రంలో లీడ్ రోల్స్ చేస్తున్నాడు.

‘బెంగళూరు హై’పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవల ప్రారంభమైంది. వీకే ప్రకాశ్‌‌‌‌‌‌‌‌ దర్శకత్వంలో డా.రాయ్‌‌‌‌‌‌‌‌ సి.జె నిర్మిస్తున్నారు. ప్రజల్లో డ్రగ్స్‌‌‌‌‌‌‌‌పై అవగాహన కల్పించేందుకు దీన్ని తెరకెక్కిస్తున్నామని, తన తప్పు సరిదిద్దుకునేందుకు చాకో ఈ సందేశాత్మక చిత్రంలో నటిస్తున్నాడని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ సినిమా అప్డేట్ రావడంతో 'మార్పు మంచిదే.. ఇదే కొనసాగించు' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.