మ్యూనిచ్: ఇండియా షూటర్లు మనూ బాకెర్–సామ్రాట్ రాణా జోడీ.. ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్‌లో రజతం గెలిచారు. శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో మనూ–రాణా 483.6 పాయింట్లతో రెండో ప్లేస్‌లో నిలిచింది.
క్వాలిఫయింగ్‌లోనూ ఇండియా ద్వయం 582 పాయింట్లతో రెండో ప్లేస్‌ను సాధించగా.. సురుచి–శ్రవణ్ కుమార్ 575 పాయింట్లతో సరిపెట్టుకున్నారు. చైనా షూటర్లు యావో కియాన్‌క్సున్ –హు కై (చైనా, 483.9), షెన్ యియావో–షువై హాంగ్ (418.0) వరుసగా స్వర్ణం, కాంస్యం గెలుచుకున్నారు.
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఎలావెనిల్ వాలరివన్–అర్జున్ బబుటా 14వ, ఆర్య బోస్–తుషార్ సాహు 16వ స్థానాలతో సరిపెట్టుకున్నారు.
